Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వైన్స్ టెండర్లో కిక్కు…. ఎవరిని వరించునో?

వైన్స్ టెండర్ దారులు ఉదయం ఆలయాల్లో ప్రత్యేక పూజలు.

సూర్యాపేట ప్రతినిధి ఆగస్టు 21 నిజం చెపుతాం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యం టెండర్లకు దరఖాస్తుల ఆహ్వానించడంతో గత సంవత్సరంతో పోలిస్తే గ్రామాలు పట్టణాల్లో సైతం టెండర్లకు విశేష స్పందన జరిగింది.

దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 2500 కోట్ల పైచిలుకు ఆదాయ వనరులు లభించడం అధికంగా లాభం జరిగిందని చెప్పవచ్చు..

సూర్యాపేట జిల్లాలో, తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం17 వైన్ షాపుల గాను 597 దరఖాస్తులతో, సుమారు 12 కోట్లు కోట్లు రాబడి జరిగింది.

దీనిలో తుంగతుర్తి మండల కేంద్రంలోనూ మూడు వైన్ షాపుల గాను సుమారు101 దరఖాస్తులతో 2కోట్ల 20 లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి ఈ సంవత్సరం లభించడం గమనార్వం.

అరవపల్లి తిరుమలగిరి మద్దిరాల నాగారం నూతనకల్ మండలాలతో పోలిస్తే తుంగతుర్తి లోనే అత్యధిక దరఖాస్తులు టెండర్దారులు స్వీకరించారు.

సోమవారం ఉదయం సంబంధిత టెండర్దారులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, టెండర్లు రావాలని కోరుకున్నారు. ఏది ఏమైనా సాయంత్రం వరకు కిక్కు ఎవరికి… వస్తుందో వేచి చూద్దామా మరి….