మార్జిన్ లేక టర్నింగ్స్ వద్ద పొంచి ఉన్న ప్రమాదం
తాసిల్దార్ ఆఫీస్ బైపాస్ 40 ఫీట్ రోడ్ సైడ్ మార్జిన్ లేక టర్నింగ్స్ వద్ద పొంచి ఉన్న ప్రమాదం
ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయని ఆర్ అండ్ బి మున్సిపాలిటీ
విద్యుత్ స్తంభాలు లేక కరెంటు లేక లక్షలు పెట్టి లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తా అన్న మున్సిపల్ అధికారులు ఎటుపోయారు
రోడ్డుకి ఇరువైపులా వ్యవసాయదారులు రోడ్డు తోముతున్న పట్టించుకోని అధికారులు
రోడ్డు పోసి నాలుగు నెలలు కావస్తున్న ఫుల్ వీల్స్ లు టాక్టర్స్ పోవటంవల్ల రోడ్డు డ్యామేజ్ జరుగుతుంది
మూడు నుంచి నాలుగు కోట్ల మధ్య ఖర్చు పెట్టి కాంట్రాక్టర్ రోడ్డు పోస్తే ఆక్రమణకు గురవుతుంది
నేరేడుచర్ల న్యూస్ :
నేరేడుచర్ల మున్సిపాలిటీ లోని రామాపురం రోడ్డు నుంచి తాసిల్దార్ ఆఫీస్ బైపాస్ రోడ్డు మూడు కోట్ల వ్యయంతో నిర్మాణం చేసిన 40 ఫీట్లు ఉండాల్సిన రోడ్డు ఆక్రమణ గురి అవుతున్న రోడ్డు కిరువైపులా వ్యవసాయదారులు రోడ్డు తోముతున్న పట్టించుకోని మున్సిపల్ అధికారులు
రోడ్డు కిరువైపులా మూల మలుపులు వద్ద ప్రమాదాలు పొంచి ఉన్న ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి
నేరేడుచర్ల మున్సిపాలిటీ వారు లైటింగ్ సిస్టం కూడా అమర్చలేదు ఇంతవరకు రోడ్డు పోసి నాలుగు నెలలుగా కావస్తున్న విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు
మద్యం తాగేవారు రోడ్డుపై మద్యం సీసాలు పగలగొడుగుతుంటే పట్టించుకోవటం లేదు
రోడ్డుపై నడవాలంటే మద్యం సీసాల బాటిల్లు పగలగొట్టిన గాజు పెంకులు కొంతమంది పాదాచర్లకు కాళ్లకు పుచ్చుకొని గాయాల పాలైనారు
ఈ బైపాస్ రోడ్డు వంట ఉదయం పూట సాయంత్రం పూట మహిళలు భారీ ఎత్తున వాకింగ్ చేస్తారు
ఈ రోడ్డు నుంచి నేరేడుచర్ల మండలంలోని పలు గ్రామ ప్రజలు మిర్యాలగూడ వెళ్తుంటారు
వ్యవసాయదారులు ట్రాక్టర్ తో ఫుల్ విలుసులు తీసుకొని పోవడం వల్ల రోడ్డు డ్యామేజ్ అవుతుంది కోట్లు పెట్టి పోసిన రోడ్డు డ్యామేజ్ అవుతున్న పట్టించుకోని అధికారులు
తక్షణమే స్పందించి రోడ్డుకిరువైపులా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి మద్యం బాటిల్ పగలకొట్టకుండా నివారించాలని రామాపురం చింతబండ గ్రామ ప్రజలు కోరుతున్నారు