Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ బలరాం నాయక్ కే ఖరారు

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఆగస్టు 20,( నిజం న్యూస్):

మహబూబాబాద్ కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ ఖరారు అయినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

నియోజకవర్గానికి సుపరిచితుడు పార్టీని, నియోజకవర్గాన్ని అంటుకొని నిత్యం ప్రజల్లో ఉండే బలరాం నాయక్ కు టికెట్ వచ్చిందని తెలుసుకున్న కాంగ్రెస్ యువతలో ఉత్సాహం పెళ్ల బుక్కుతుంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో ఎస్టీ అభ్యర్థిగా ఒక్కడే గెలవడం “తంతే గ్యారల బుట్టలో పడ్డ ” చందంగా పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది.

ఆనాటి రోజుల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి తనదైన రీతిలో కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి నియోజకవర్గానికి పనులు చేయించారు. నేషనల్ హైవే రోడ్లు కానీ, రైల్వే ఆర్ఓబి బ్రిడ్జిలు కానీ. ముఖ్యమైన రైళ్లను మహబూబాబాద్ కేసముద్రం స్టేషన్లు ఆపించడంలో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని బలరాం నాయక సన్నిహితులు చెబుతున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కి ఊపు వచ్చింది. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బలహీన వర్గానికి చెందిన ఘనపురపు అంజయ్య అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఒక ఎత్తు అయితే,” గడి కాంగ్రెస్ను” ఎదిరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం అందులో కాంగ్రెస్ పార్టీలో యోధాను యోధులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేన్నం శ్రీకాంత్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, డాక్టర్ బేల్లయ్య నాయక్ లాంటి ఉద్దండులను ఆహ్వానించి కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు.

ఈ పరిణామం నియోజకవర్గ మండలాలలోని కాంగ్రెస్ కార్యకర్తలపై నూతన ఉత్సాహం కలిగించింది. ఈసారి ఏది ఏమైనా ఈ నియోజకవర్గం లో కాంగ్రెస్ గెలుపు తధ్యమని గ్రామాల కార్యకర్తలు ప్రజలు అనుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లో పోరిక బలరాం నాయక్ టికెట్టు కన్ఫామ్ అయినట్టు తెలిసింది. దీనితో నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, రెండవ శ్రేణి నాయకులు అత్యంత ఉత్సాహంగా పోరిక బలరాం నాయకును గెలిపిస్తామని తెగేసి చెబుతున్నారు.

ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుండి ఓటమిని చవి చూసిన బలరాం నాయక్ పై తన జాతి వర్గమైన గిరిజనులలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ వర్గాలలో సానుభూతి పవనాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.

ఏది ఏమైనా రాజకీయ వెన్నుపోట్లు లేకుండా నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ ఒక్క త్రాటిపై నిలబడితే పోరిక బలరాం నాయక్ గెలుపు “నల్లేరు మీద నడకేనని” రాజకీయ విశ్లేషకుల అంచనా!. ఏమవుతుంది చూద్దాం మరి.