Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విద్యార్థులకు ఉచిత విమానయాన సౌకర్యం

– కల్పించిన…లక్ష్మీకాంత్ రెడ్డి*

మాడ్గుల ఆగస్టు 19 ( నిజం చెపుతాం);

పదవ తరగతి పరీక్షలలో 2023 మార్చ్ లో నిర్వహించిన పరీక్ష లొ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత విమానయాన సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు

మాడ్గుల మండల పరిధిలోని ఇర్విన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రంగారెడ్డి జిల్లాలో ద్వితీయ స్థానం సాధించిన బావాజీ తరుణ్9.8, శివ ప్రసాద్ 9.7, అబెద అంజుమ్ లను శనివారం ఎస్ఎంసి చైర్మన్ గుండె వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి నర్వ మాజీ పిఎసిఎస్ చైర్మన్ ఉచితంగా చెన్నైకి విమానయాన సౌకర్యం కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

విద్యతోనే ఆర్థిక అభివృద్ధితో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జ్ ఎంఈఓ సర్దార్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.