కేసీఆర్ అంటే నీళ్లు…. నీళ్లు అంటేనే కేసీఆర్

*పులుసు బొంత ప్రాజెక్టు కొరకు అవసరమైతే రేగా నీ ఢిల్లీ కి తీసుకెళ్తా
* రాజకీయ నిరుద్యోగులరా అసత్య ఆరోపణలు మానుకోండి
* మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత
మన్యం టీవీ పినపాక: నీళ్లు అంటేనే కెసిఆర్… కెసిఆర్ అంటేనే నీళ్లు అని ఎంపీ మాలోత్ కవిత అన్నారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కొత్తగూడెం లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. భూగర్భ జలాలు పెరిగి రైతన్నలు ఆనందంగా ఉనారాన్నారు. పులుసు బొంత ప్రాజెక్టు విషయమై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రాజెక్టుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, అవసరమైతే విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావును కేంద్రంతో మాట్లాడించడానికి ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. పులుసు బొంత ప్రాజెక్టు
విషయంలో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు .రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొంతమంది వ్యక్తులు అభివృద్ధికి కేరాఫ్ అయిన రేగా కాంతారావు పై విమర్శలు చేయడం తగదన్నారు .వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. రేగా కాంతారావు అభివృద్ధి పనులను ప్రజలందరూ గమనిస్తున్నారని ఎంపీ కవిత అన్నారు.