Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వ్యవసాయేతర నోటరీ, స్టాంపు పత్రాలపై కొనుగోలు చేసిన స్థిరాస్తులను క్రమబద్దీకరించుకోవాలి

 

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి,ఆగస్టు19, (నిజం న్యూస్):

పట్టణాల్లో వ్యవసాయ సాగులో లేని స్థిరాస్తులుగా నోటరీ, స్టాంప్ పేపర్ తో కొనుగోలు చేసినవారు “ప్రభుత్వ ఉత్తర్వులు 84″ క్రింద క్రమబద్దీకరణ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు.
జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రుర్, డోర్నకల్ మున్సిపాలిటీ లలో కేవలం స్టాంప్ పేపర్ తో వ్రాయించుకున్న స్థలాలను క్రమబద్దీకరణ చేసుకునేందుకు ఇది ఒక చక్కని అవకాశమని కలెక్టర్ నివాసితులకు సూచించారు.

దీనికి సంబంధించి క్రమబద్ధీకరణ కార్యక్రమం 2023 ఆగస్టు ఒకటవ తేదీ నుండి మూడు నెలల పాటు అమలులో ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అందుకుగాను దరఖాస్తు తో పాటు లింక్ డాక్యుమెంట్, ప్రాపర్టీ టాక్స్ రిసిప్ట్ ఎలక్ట్రిసిటీ రిసిప్ట్, వాటర్ బిల్లు తదితర ధ్రువీకరణ పత్రాలతో. ” మీ సేవ ” ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు సమర్పించాలన్నారు.
అభ్యంతరాలు ఉన్న స్థలాలను చేయడం కుదరదు అన్నారు.

మూడువేల చదరపు అడుగుల స్థలం వరకే క్రమబద్ధీకరణ చేయబడుతుందని అంతకుమించి స్థలాన్ని చేయటం కుదరదు అన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు