Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్లను ఆపాలి

– ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఆగస్టు 19(నిజం చెపుతాం)

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులను అక్రమ డిప్యూటేషన్లను ఇచ్చి పోస్టింగ్ ఇస్తున్న పద్ధతిని ఆపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రు అనిల్ వనం రాజు అన్నారు.
ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కి ఎస్ఎఫ్ఐ యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్లను ఆపాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల చదువులు సాఫీగా జరగాలని పేద విద్యార్థులు బాగా చదువుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగా ఉన్నదని అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరత చాలా ఉన్నదని వారన్నారు. ఈ విద్యా సంవత్సరం ఆ యొక్క సమస్యను గుర్తించి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టు ఉపాధ్యాయులను 215 మందిని జిల్లాలో పాఠశాలలో సర్దుబాటు చేయడం జరిగిందని అన్నారు.

ఈ విషయాన్ని ముందు ఉంచుకొని జిల్లా విద్యాశాఖ అధికారులు 20 మంది ఉపాధ్యాయులకు వారు కోరిన చోట డిప్యూటేషన్ ఇచ్చి పాఠశాలలో విధులు నిర్వహించడానికి అక్రమంగా వారికి సహకరించరనివారు అన్నారు.

విద్యార్థుల చదువులు దృష్టిలో పెట్టుకొని వారు ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ విషయాన్ని ఖాతాలు చేయకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు వారి ఇష్టారాజ్యంగా 20 మందికి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా డిప్యూటేషన్లు ఇవ్వడం జరిగిందని వారన్నారు.

అక్రమ డిప్యూటేషన్లకు పాల్పడుతున్న జిల్లా అధికారుల పైన చర్యలు తీసుకొని అక్రమ డిప్యూటేషన్లను ఆపాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు చింతల శివ లావుడియా రాజు జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు జిల్లా కమిటీ సభ్యులు ఈర్ల రాహుల్ గంగదేవి సాయి పరమేశులు పాల్గొన్నారు.