Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణా బిడ్డకు అరుదైన గౌరవం 

తెలంగాణ ముద్దు బిడ్డకు ఒక అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. తెలంగాణా రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా చిట్యాల మండలం బావుసింగ్‌పల్లికి చెందిన డాక్టర్‌ రాంకిషన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఒక అరుదైన ఆహ్వానం అందింది.

బయోలాజికల్‌ స్టాండైర్డెజేషన్‌పై నియమించిన నిపుణుల కమిటీలో అంటే ఎక్స్‌పర్ట్‌ అడ్వైజరీ ప్యానెల్‌ లో నాలుగేండ్లపాటు ఆ పదవిలో కొనసాగుతూ అడ్వైజత్ స్థాయిలో సేవలు అందించాలని అభ్యర్ధన అందించింది.

డాక్టర్ రాంకిషన్‌ ప్రస్తుతం కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డ్రగ్‌ కంట్రోలర్‌గా హైదరాబాద్‌లోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ జోనల్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ, తెలంగాణ, ఏపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ రంగంలో ఆయనకు 25 ఏండ్ల అనుభవం ఉన్నది.

ఆయన అందించిన అపూర్వ సేవలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 35 అవార్డులు అందుకోగా 18 దేశాల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి సమావేశాల్లో భారత దెసానికి ప్రాతినిధ్యం వహించారు కాగా రెండు పేటెంట్లు కూడా సాధించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేయనున్న తొలి తెలంగాణ వ్యక్తిగా రాంకిషన్‌ నిలువబోతున్నారు. ఔషధ రంగంలో ఆయనకున్న పరిజ్ఞానాన్ని ప్రంపచ ఆరోగ్య సంస్థ గుర్తించి ఒక అరుదైన గౌరవం ఇవ్వడం తెలంగాణా రాష్ట్రానికే కాక మొత్తం దేశానికే గర్వ కారణం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది అంతర్జాతీయ ప్రజారోగ్యానికి బాధ్యత వహించే ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ కార్యాలయాలు మరియు 150 ఫీల్డ్ కార్యాలయాలను కలిగి ఉంది. వ్హో యొక్క అధికారిక ఆదేశం ప్రపంచవ్యాప్తంగా బలహీనులకు సహాయం చేస్తూనే ఆరోగ్యం మరియు భద్రతను ప్రోత్సహించడం.

ఇది దేశాలకు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది, అంతర్జాతీయ ఆరోగ్య ప్రమాణాలను నిర్దేశిస్తుంది, ప్రపంచ ఆరోగ్య సమస్యలపై డేటాను సేకరిస్తుంది మరియు ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రీయ లేదా విధాన చర్చలకు ఫోరమ్‌గా పనిచేస్తుంది.

దాని అధికారిక ప్రచురణ, ప్రపంచ ఆరోగ్య నివేదిక , ప్రపంచవ్యాప్త ఆరోగ్య అంశాల అంచనాలను అందిస్తుంది.

(కధనం: ప్రతాప్)