Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

8 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

భద్రాచలం ఆగస్టు 18 (నిజం చెబుతాం )

భద్రాచలం ఏఎస్పీ పరతోష్ పంకజ్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు, ఈరోజు సాయంత్రం భద్రాచలం పట్టణంలోని అప్సర లాడ్జిలో పేకాట ఆడుతున్నరన్న పక్కా సమాచారంతో భద్రాచలం పోలీసులు అప్సర లాడ్జ్ పై రైడ్ చేసి 8 మందిని పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.లు 1,55,350/- నగదు తో పాటుగా 8 సెల్ ఫోన్లు ఒక మోటార్ సైకిల్ ను సీజ్ చేయడం జరిగింది.

పేకాట ఆడుతున్న వారి వివరాలు తెలుసుకొనుగా భద్రాచలం పట్టణానికి చెందిన 1.గంటా రామారావు, 2. పాతూరి ప్రసాద్, 3.వెలగ రమేష్, 4. చెండా చంద్రశేఖర్ రెడ్డి, 5. బొల్లు సత్యనారాయణ,6. గూడపాటి శ్రీనివాసరావు, 7. అనుముల సీతారామిరెడ్డి మరియు 8. అడబాల వెంకటేశ్వరరావు గా తెలిసింది,

వీరితోపాటుగా లాడ్జి నిర్వాహకుడికై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి రైడ్ లో భద్రాచలం సిఐ నాగరాజు రెడ్డి, ఎస్సై PVN రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.