Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ నెల 26 న కోటి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం

కాలుష్య రహిత తెలంగాణా దిశగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంతో మూసుకుపోతూ మొత్తం దేశానికే తలమానికంగా నిలిచింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక అరుదైన ఘట్టానికి రూప కల్పన చేసింది.

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగింపు కూడా అంతే ఘనంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. అజాదీ అమృతోత్సవ్ (స్వాతంత్య్ర వజ్రోత్సవ) వేడుకల ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 26న కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకుగాను ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. . రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాల్టీల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంఘాలు, సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాములుగా చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.

ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టాలని, ఆగస్టు 26న జరిగే ప్లాంటేషన్ లో ప్రజాప్రతినిధులు, , వివిధ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ALSO READ: తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ తీపి కబురు

ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను సత్వరమే అమలు చేయాలని , నీటి పారుదల శాఖ పరిధిలోని భూములలో ఏర్పాటు చేస్తున్న సంపద వనాలలో లక్ష్యం మేరకు మొక్కలు నాటే ప్రక్రియ 2 వారాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.

ప్రతీ జిల్లాలో హరితహారం క్రింద మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించింది.

ఈ నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ విధంగా వున్నాయి.

– ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను సత్వరమే అమలు చేయాలి

– ఆసరా ఫించన్ బదిలీ సత్వరమే జరిగేలా చూడాలి

– ఆగస్టు 26న కోటి మొక్కలు నాటేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణ

– గొర్రెల పంపిణీ లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి

– బీసి కులవృత్తుల లక్ష రూపాయల ఆర్థిక సహాయం మొదటి దశ పంపిణీ త్వరగా పూర్తి

– మైనారిటీల సంక్షేమం క్రింద లక్ష సహాయం లబ్దిదారులకు త్వరగా అందించాలి

– పారదర్శకంగా గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపిక

– సోషల్ వెల్ఫేర్ శాఖ పరిధిలో ఇంటి పట్టాల పంపిణీకి త్వరితగతిన పూర్తి చేయాలి

(కధనం: ప్రతాప్)