మంత్రి, ఎంపీ లను మర్యాద పూర్వకంగా కలిసిన పినపాక ప్రజాప్రతినిధులు, టీఆరెస్ నాయకులు
కరకగూడెం మండలం పర్యటనకు విచ్చేసిన రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్, మహబూబాద్ ఎంపీ మాలోత్ కవితలను పినపాక మండల ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ, జెడ్పిటిసి దాట్ల సుభద్రాదేవి వాసు బాబు లు మంత్రి, ఎంపీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, శ్రీనివాస రావు ఉప సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు కొండేరు నాగభూషణం, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము,పోలి శెట్టి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.