Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

శిశువు ప్రాణం ఖరీదు 2.20లక్షలు

*వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి*

*సెటిల్ మెంట్ చేసిన IMA*

*పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు*

సూర్యాపేట ప్రతినిధి ఆగస్టు 18 నిజం చెపుతాం న్యూస్

వైద్యుడి నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందగా ప్రాణానికి రూ.2.20లక్షలకు బేరం కుదిర్చి సెటిల్ మెంట్ చేశారు ఆసుపత్రి యాజమాన్యం.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బేబీ కేర్ సెంటర్లో ఈ వ్యవహారం జరగగా ఐఎంఏ మధ్యవర్తిత్వం వహించి సైలెంట్ గా సెటిల్ మెంట్ చేశారు.

తల్లి మాత్రం శిశువును పోగొట్టుకున్న బాధలో డాక్టర్లను వదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చోగా బంధువులు ఓదార్చి అక్కడి నుండి పంపించడం గమనార్హం.

భాదితులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని కుడ కుడ కు చెందిన బురా ఉపేందర్, శోభకు చెందిన రెండవ బాబుకు టీక వేయించడంతో బాబుకు జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని బేబీ కేర్ సెంటర్ కు తీసుకువచ్చారు.

బాబుకు పరీక్షించిన డాక్టర్ పరీక్షలు చేయాలని సిబ్బందికి చెప్పి వెళ్లిపోయారు. దీనితో సిబ్బంది బాబుకు రక్ష పరీక్షల కోసం రక్తం తీసేందుకు ప్రయత్నాలు చేయగా నరాలు దొరకకపోవడంతో పదే పదే చేతికి ఇంజెక్షన్ చేయడంతో రక్తం గడ్డకట్టడంతో శిశువు అపస్మారక స్థితికి వెళ్ళింది.

దీనితో శిశువు తల్లి డాక్టర్ కు సంప్రదించగా పరీక్షించిన డాక్టర్ బాబుకి సీరియస్ గా ఉందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అయితే అంబులెన్స్ వచ్చే సమయానికి శిశువు మృతి చెందడంతో శిశువు తల్లిదండ్రులు మృతికి కారణం డాక్టర్ నిర్లక్ష్యం అని ఆరోపిస్తూ ఆందోళన కు దిగారు.

*రంగంలోకి దిగిన ఐ ఎం ఏ

శిశువు మృతి చెందడంతో బంధువులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగడంతో ఐ ఎం ఏ రంగంలోకి దిగి వ్యవహారం బయటకు పొక్కకుండా సెటిల్ మెంట్ చేశారు.

శిశువు మృతదేహాన్ని ముందు పెట్టుకొని బేరమడరు. చివరకు రూ.2.20లక్షలకు తల్లిదండ్రులకు ఇచ్చేందుకు ఒప్పించరు.

అయితే తల్లి మాత్రం తన కొడుకుని పొట్టన పెట్టుకున్న డాక్టర్లను వదిలిపెట్టేది లేదంటూ అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు.

చివరకు ఒప్పించి హాస్పిటల్ నుండి పంపించారు. జరిగిన సంఘటన పై ఉన్నతాధికారులు విచారణ జరిపి, ప్రవేట్ దవాఖాన యాజమాన్యం పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని పేద ప్రజలు డిమాండ్ చేస్తున్నారు…