Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆగిన లారీ నుండి 250 లీటర్ల డీజిల్ చోరీ

లబోదిబోమ్మంటున్న హర్యానా లారీ డ్రైవర్

కల్లూరు ఆగస్టు 18 (నిజం న్యూస్)

స్థానిక జాతీయ ప్రధాన రహదారిపై మినీ స్టేడియం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి లారీ ఆపి విశ్రాంతి తీసుకుంటున్న డ్రైవర్ ను గమనించిన చీకటి దొంగలు డీజిల్ ట్యాంక్ ను చాకచక్యంగా తెరిచి అందులో ఉన్న సుమారు 250 లీటర్ల డీజిల్ ను దొంగలించుకొని వెళ్లారు.

ఈ విషయాన్ని ఉదయం గమనించిన హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ జమీల్ హేమంత్ లబోదిబోమంటూ శుక్రవారం సాయంత్రం వరకు అదే స్థానంలో వేచి ఉన్నాడు. జరిగిన ఈ సంఘటనపై డ్రైవర్ ను వివరణ కోరగా తాను చంద్రపూర్ నుంచి సిమెంట్ లోడు దిగుమతి చేసేందుకు సత్తుపల్లి వచ్చి సత్తుపల్లిలో సగం లోడ్ దిగుమతి చేసుకొని, కల్లూరులో దిగుమతి చేయాల్సి ఉండంగా తెల్లవారే వరకు ఆగుదామని ఇక్కడ వేచి ఉన్నట్లు తెలిపాడు.

రాత్రి ఒంటిగంట వరకు నేను మెలకువతోనే ఉన్నానని ఆ తరువాతే డీజిల్ దొంగిలించుకు వెళ్లారని పేర్కొన్నాడు. తాను ఎన్నో సంవత్సరాల నుండి లారీ డ్రైవర్ గా వృత్తి కొనసాగిస్తున్నానని ఈ విధమైన దోపిడీ ఎక్కడ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చోరీకి గురైన డీజిల్ విలువ సుమారు రూ. 24 వేలు ఉంటుందని చెప్పాడు.

జరిగిన ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పలువురు తెలుపగా ఫిర్యాదు చేస్తారని అన్నాడు.

కల్లూరు లో ఇటీవల వాహనాల నుండి పెట్రోలు డీజిల్ దొంగతనాలు విపరీతంగా పెరిగాయని, దొంగలు తమ ట్రెండు మార్చి లారీలను కూడా వదలకుండా చాకచక్యంగా డీజిల్ మాయం చేయడం పట్ల వాహనదారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.