Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తక్కువ బడ్జెట్ తో వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్స్ చేసిన సినిమాలు ఏవో తెలుసా??

సినిమాలు ఎక్కువ బడ్జెట్ తో వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం సాధారణమే.. కానీ ఊహించని విధంగా మరీ తక్కువ బడ్జెట్ తో వచ్చే ఎవరు ఊహించలేని విధంగా కలెక్షన్ చేసే సినిమాలు చాలా తక్కువ.. స్టోరీ ఉంటే చాలు బడ్జెట్ తో సంబంధం లేకుండా అధిక వసూలు చేసిన సినిమాలు ఏవో తెలుసా???

ఆ తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు గురించి తెలుసుకుందాం…

1.సైరత్…

సైరాట్ సినిమా తక్కువ బడ్జెట్ తో వచ్చి ఎవరు ఊహించలేని విధంగా ఎక్కువ కలెక్షన్లను సాధించింది.. ఈ సినిమాకు డైరెక్టర్ నాగరాజ్ మంజులె దర్శకత్వం వహించారు. సైరట్ సినిమా 2016 ఏప్రిల్ 19న విడుదల అయింది. ఈ సినిమా పూర్తిగా డ్రామా అండ్ రొమాన్స్ మరియు ప్రేమ కథగా ఉంటుంది.. ఈ సినిమా ఒక మరాఠీ సినిమా..

ఈ సినిమాకు మేకర్స్ 4 కోట్ల బడ్జెట్ పెట్టగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై ఎవరు ఊహించని విధంగా 110 కోట్లు సాధించింది..

2. సీక్రెట్ సూపర్ స్టార్…

సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా 2017 అక్టోబర్ 19 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకి డైరెక్టర్ అద్వైట్ చందన్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా హిందీ మ్యూజికల్ డ్రామాగా ఉంటుంది..

ఈ సినిమాలో అమీర్ ఖాన్, జైరావాస్మిన్, మెహర్ విజి, రాజ్ అర్జున్ లో ముఖ్య పాత్రలు పోషించారు.. ఈ సినిమా పూర్తిగా మ్యూజికల్ గురించి ఉంటుంది..

ఈ సినిమాకి మేకర్స్ 15 కోట్లు బడ్జెట్ పెట్టగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై ఎవరు ఊహించని అనుకోని విధంగా 965 కోట్లు బడ్జెట్లను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ రాబట్టింది..

3.ది కాశ్మీర్ ఫైల్స్…

ప్రపంచవ్యాప్తంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎంతో మంచి పేరు సాధించిన సినిమా. ఈ సినిమా 2022 మార్చి 11న విడుదలైంది..

ఈ సినిమాకు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా డ్రామా మరియు హిస్టారికల్ గా ఉంటుంది.. ఈ సినిమా కాశ్మీర్లో తిరుగుబాటు జరిగిన సమయంలో కాశ్మీరీ హిందువుల వలస గురించి చాలా బాగా చూపించారు.. ఈ సినిమా కాశ్మీరి హిందువుల మీద అక్కడ జరిగిన అల్లర్ల మీద ఉద్దేశించి ఈ సినిమా ఉంటుంది..

ఈ సినిమాకు 10 కోట్లు బడ్జెట్ పెట్టక ఈ సినిమా విడుదలై 388 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది..

ఈ సినిమా మంచి స్థాయిలో ప్రేక్షకులకు అలరించి ఎన్నో అవార్డులను మంచి పేర్లు సాధించింది..