Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టాలీవుడ్ లో కోట్లు వసూలు చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా??

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎందరో సినిమాలలో నటించడానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారు ఎందరో. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చి టాలీవుడ్ లో కోట్లు వసూలు చేసే హీరోయిన్ ఎవరో మీకు తెలుసా???

వారెవరో తెలుసుకుందాం…

దీపికా పడుకొనే…

2024 జనవరి 12న డైరెక్టర్ నాగస్విన్ దర్శకత్వంలో విడుదల కానున్న సినిమా ప్రాజెక్టు కె (కల్కి 2898 ఏడి) అనే చిత్రంలోని ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే నటిస్తుంది.. ఈ సినిమా పూర్తిగా సైంటిఫిక్ గా ఉండబోతుంది..

ప్రాజెక్టు కే సినిమాలో నటిస్తున్నందుకు గాను దీపిక పడుకొని ఈ సినిమాకు 8కోట్లు  తీసుకుంటుంది.

జాహ్నవి కపూర్…

2024 ఏప్రిల్ 25న డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా విడుదల కానుంది.. ఈ సినిమా ఎన్టీఆర్కు 30వ సినిమా.. ఈ సినిమాను మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..

ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖన్ నటిస్తున్నాడు… ఈ సినిమాలో హీరోయిన్

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్ శ్రీదేవి కపూర్ కూతురు జాహ్నవి కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు..

ఈ సినిమా జాహ్నవి కపూర్ కి తెలుగులో మొదటి సినిమా.. ఈ సినిమాతో జాహ్నవి కపూర్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది..

అయితే ఈ సినిమా కోసం జాహ్నవి కపూర్ 5 కోట్ల రూపాయలు తీసుకుంటుంది..

కైరా అద్వానీ…

2024 లో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది.. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది.. ఈ సినిమా పూర్తిగా డ్రామాగా ఉంటుంది.. ఈ సినిమాను మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..

ఈ సినిమాలో నటిస్తున్నందుకుగను హీరోయిన్ కైరా అద్వానీ నాలుగు కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..