Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సోలార్ విద్యుత్ వినియోగంలో రాష్ట్రం ముందడుగు

కాలుష్య రహిత తెలంగాణ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తొలి నాటి నుండి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తొంది.

తొలుత రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి హరిత తెలంగాణగా మార్చేయదంతో పాటు దేసంలో అత్యధిక విస్తీర్ణంలో గ్రీనరీ ఏర్పాటు చేసిన రాష్ట్రం గా వినుతి కెక్కింది.

కాగా తాజాగా తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొత్తగా నిర్మితమవుతున్న కలెక్టరేట్ భవనాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేదిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో 200 కిలోవాట్ల గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను తెలంగాణ రెడ్కో సంస్థ ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో హైటెన్షన్ సర్వీస్‌లో నెలకు దాదాపు 14 వేల యూనిట్లకు పైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు.అలాగే లోటెన్షన్ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగమవుతోంది.

అంటే నెలకు మొత్తం 28వేల యూ నిట్లకు పైగా విద్యుత్ అవసరం అవుతోంది. 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో నిర్మించిన అన్ని కొత్త ఐ డి వో సి లలో ఖమ్మం ఐ డి వో సి యొక్క సోలార్ పవర్ ప్లాంట్ గ్రిడ్‌తో సమకాలీకరించబడిన మొదటిది.

ఇది దేశంలోనే పూర్తిగా సౌరశక్తితో నడిచే మొదటి కలెక్టరేట్, తద్వారా పూర్తి ‘గ్రీన్ బిల్డింగ్’గా గుర్తింపు పొందింది.

ప్రస్తుతం నెలకు లక్షా ఎనభై వేల రూపాయలకు పైగా గ్రిడ్ నుండి విద్యుత్ కొనుగోలు కోసం విద్యుత్ బిల్లు వస్తోంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో దాదాపు 80 శాతం వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది.

దీనివలన ఏటా దాదాపు 23 లక్షల రూపాయల వరకు చార్జీల భారం తగ్గనుంది అని ప్రభుత్వ అంచనాలు తెలియజేస్తున్నాయి.

ఇక సూర్యాపేట జిల్లా సమీకృత జిల్లా కా ర్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాం ట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏటా 11 లక్షల 23 వేల 200 రూపాయలు ఆదా కానున్నాయి.

అలాగేఈ ప్రణాళికలో భాగంగా 120 కిలోవాట్ల సామర్ధ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్ లో మరో 100 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్ పనులు త్వరితగతిన నడుస్తున్నాయి.

కాలక్రమేణా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ భవన సముదాయాలలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం చురుకుగా ప్రణాళికలు సిద్ధం చెస్తోంది.

తద్వారా సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యా న్ని తగ్గించడంతో పాటు.. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు.

ఏ ఇంటికైనా నెల వ‌చ్చిందంటే భ‌య‌పెట్టేది క‌రెంటు బిల్లే. గృహ విద్యుత్తు దాదాపుగా ప్ర‌తి రాష్ట్రంలోనూ వినియోగ‌దారుల‌కు భారంగానే మారుతోంది.

ఈ నేప‌థ్యంలో గృహ వినియోగ‌దారుల‌కు పాతికేళ్ల వ‌ర‌కు పైసా క‌రెంటు బిల్లు క‌ట్ట‌న‌వ‌స‌రం లేకుండా.. ఇంటికి రాయితీపై త‌క్కువ ఖ‌ర్చుతో సౌర విద్యుత్తు వెలుగులు పంచే ఒక ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది.

కేవ‌లం సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవ‌డ‌మే కాదు, మ‌నం వాడుకోగా మిగిలిన క‌రెంటును ఎంచ‌క్కా డిస్కంల‌కు అమ్మి సొమ్ము చేసుకునే ప్ర‌యోజ‌నం కూడా క‌లిగించే ప‌థ‌క‌మే రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్.

ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా, రాష్ట్రంలో రూఫ్ టాప్ సోలార్ ప్రోజెక్టులపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తోంది.

(కధనం: ప్రతాప్)