ఆలమూరు వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కిన చంద్రబాబు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆగస్టు 17,( నిజం న్యూస్) బ్యూరో:: గవర వెంకటరమణ::
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆలమూరు వద్ద కాకినాడ నుంచి రావులపాలెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కి సామాన్య ప్రయాణికుడిలా కండక్టర్ దగ్గర నుండి స్వయంగా టిక్కెట్ కొని జొన్నాడవైపు ప్రయాణించారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నంతసేపు చంద్రబాబు బస్సులో ఉన్న ప్రయాణికులతో ముచ్చటించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
అలాగే పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీల పై మహిళలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దారి పొడవునా ప్రయాణికులతోనూ, మహిళలతోనూ మమేకమై
రాష్ట్రంలో పెరిగిన నిత్యవసర సరుకుల ధరలను గురించి అడిగి తెలుసుకున్నారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
సాక్షాత్తు చంద్రబాబు నాయుడే తాము ప్రయాణించే బస్సు ఎక్కాడంటే బస్సులో ఉన్న ప్రయాణికులు అంతా ఆ కాసేపూ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు.