Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్:

టి ఎస్, ఆగస్ట్17 (నిజo చెపుతాం న్యూస్);

సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా చోట్ల తెలంగాణలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారాలను నమ్మవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ప్రచారాల్లో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసత్య ప్రచారాల్ని ఎవరు నమ్మొద్దని నేడు పత్రికా ప్రకటణ విడుదల చేశారు.

ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా వస్తున్న ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని హెచ్చరించారు.

ప్రభుత్వం తరపు నుంచి కచ్చితంగా ప్రకటన ఇస్తామని, ప్రస్తుతం ఎలాంటి రేషన్ కార్డులు జారీ చేయడం లేదని ఆయన అన్నారు.

ఈ మేరకు ప్రజలు వాస్తవాలను గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.