Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

70 వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ షురూ 

హైదరాబాద్ నగర వాసులకు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు స్వంత ఇంటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో పంపిణీ ప్రక్రియను జిహెచ్ఎంసి మరింత వేగవంతం చేసింది.

జిహెచ్ఎంసి నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియపై జి హెచ్ ఎం సి కీలక వివరాలు వెల్లడించింది.

ఇప్పటికే 70వేల ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని, దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు తెలిపారు.

ఇందులో సుమారు 4500 కు పైగా ఇండ్లను ఇన్ సిట్యూ లబ్ధిదారులకు జి హెచ్ ఎం సి అందించింది.

నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తిచేసి అర్హులను గుర్తిస్తున్నదని ప్రభుత్వం తెలిపింది.

నగరం ఎన్నడూ ఊహించనంత వేగంగా విస్తరిస్తున్నందున పేద, మధ్యతరగతి, అప్లాదాయ వర్గాలకు ఇళ్ళ సమస్యలు తీవ్రంగా వున్నాయి.

ఆదాయం అంతంతమాత్రంగా వున్నవారికి నగరంలో ఆకాశానంటుతున్న ఇళ్ళ అద్దెలు భరించడం కష్తంగా వుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూంల నిర్మాణం చేపట్టింది.

(ప్రత్యేక కధనం: సి.హెచ్.ప్రతాప్)