గుట్ట లో హుండీ లెక్కింపు ..22 రోజుల ఆదాయం ఒక కోటి 89 లక్షలు
*లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
*లక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు
*22 రోజుల ఆదాయం ఒక కోటి 89 లక్షలు
యాదగిరిగుట్ట:ఆగస్టు16(నిజంచెపుతాం)యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిదేవస్థానాన్న బుధవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన వెసులుబాటు కల్పించారు.
ప్రత్యేక పూజలు అనంతరం అద్దాల మండపం వద్ద అర్చకులు వేదాఆశీర్వాదం చేశారు.ఆలయ ఏఈఓ రమేష్ బాబు,సూపరిండెంట్ రాజన్ బాబు స్వామివారి శేష వస్త్రం అభిషేకం లడ్డు ప్రసాదం అందజేశారు.
స్వామివారి 22 రోజుల హుండీలు ఆలయ ఈవో గీతారెడ్డి పర్యవేక్షణలో కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రతం మండపంలో లెక్కించగా రూ 1,89,04,607 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మిశ్రమ బంగారం 66 గ్రాములు, మిశ్రమ వెండి1కిలో 500 గ్రాములు,విదేశీ రూపాయలు అమెరికా2158 డాలర్లు,యూఏఈ30 ధీరమ్స్,రియాల్స్71, ఆస్ట్రేలియా30 డాలర్స్,కెనడా 20 డాలర్స్ మరియు బుధవారం రోజు స్వామివారి నిత్యాదాయం రూ.25,43756 వచ్చిందని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.