అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎజెండా

*ప్రభుత్వమే ప్రతి గింజ కొనుగోలు చేస్తుంది
*సీతారామ బ్యాక్ వాటర్ సద్వినియోగానికి కృషి
*రెండు జిల్లాలను సస్యశ్యామలం చేస్తా
* పులుసు బొంత ప్రాజెక్టు పూర్తిగా సహకరిస్తారు
* రేపు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చే ధరణి పోర్టల్ ఆవిష్కరణ
* 1/70 ప్రాంతంలో ప్రభుత్వ జోక్యం ఉండదు
మన్యం టీవి,పినపాక: అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎజెండా అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆయన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పూర్వ ఖమ్మం జిల్లాలో సస్యశ్యామలం చేసే వరకు విశ్రమించేది లేదన్నారు సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో నిల్వ ఉన్న బ్యాక్ వాటర్ ను సద్వినియోగం చేసుకొని పినపాక నియోజకవర్గం చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ ఇరుపాక శాసనసభ్యులు రేగా కాంతారావు చిరకాల వాంఛ అయిన ప్రాజెక్టు నిర్మాణానికి శాయశక్తుల కృషి చేస్తానని మంత్రి పువ్వాడ హామీ ఇచ్చారు యావత్ రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు ధరణి పై ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారని, 1/70 ఏరియాలో ప్రభుత్వ జోక్యం ఉండదని ,ఆదివాసుల హక్కులను కాలరాసే ప్రసక్తే లేదన్నారు.ఈ సమావేశంలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు శ్ రేగా కాంతారావు,పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత , జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరం కనకయ్య , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ , అసిస్టెంట్ కలెక్టర్ అనుదీప్ , ఐటీడీఏ పీవో గౌతమ్ సబ్ కలెక్టర్ కే స్వర్ణలత ఎడిఈ తాతారావు బూర్గంపాడు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు దొర ఎంపీపీ రేగా వైస్ ఎంపీపీ అయూబ్ ఖాన్ , పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ వైస్ ఎంపీపీ సుబ్బారెడ్డి జెడ్పీటీసీ కొమరం కాంతారావు సొసైటీ డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా ఉన్నత అధికారులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు