Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బీటీ రోడ్ల నిర్మాణానికి 36 కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్

తుంగతుర్తి ఆగస్టు 16 నిజం చెపుతాం న్యూస్

తుంగతుర్తి నియోజకవర్గంలో బిటి రోడ్ల నిర్మాణానికి ₹36 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే  ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తిరుమలగిరి లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన జాజిరెడ్డిగూడెం, నూతనకల్ మండల ప్రజలు.

తిమ్మాపురం నుండి వయా కోడూరు మీదుగా సంగెం వరకు రోడ్డు నిర్మాణానికి ₹20 కోట్ల రూపాయలు మంజూరు. సంగెం నుండి నూతనకల్ వరకు రోడ్డు నిర్మాణానికి ₹12 కోట్ల రూపాయలు మంజూరు.

నూతనకల్ నుండి మిర్యాల వరకు రోడ్డు నిర్మాణానికి ₹4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల వివిధ రాజకీయ పార్టీ నాయకులు బిఆర్ఎస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు