జోరుగా ఓటర్ సర్వే
వజ్రగడ పంచాయతీ రామన్నపాలెం (చంద్రయ్యపాలెం) లో జోరుగా ఓటర్ సర్వే
చిత్రాడ. నూకేష్. నిజం న్యూస్
అనకాపల్లి జిల్లా వజ్రగడ పంచాయతీ రామన్నపాలెం (చంద్రయ్యపాలెం) గ్రామంలో బుధవారం ఓటర్ సర్వే నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి రవికుమార్, వెల్ఫేర్ అసిస్టెంట్ మహ్మద్,గ్రామంలో ప్రతీ ఇంటికీ వెళ్లి స్వయంగా ఓటర్ల ఆధార్ కార్డులను, వ్యక్తులను పరిశీలించి పక్కగా సర్వే నిర్వహించారు.
చనిపోయిన వారి పేర్లను తొలగించారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ నూతనంగా లిస్ట్ లో చేర్చారు.