Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైయస్ షర్మిల

తెలంగాణలో 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు గాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.

ఇంతటి దూరం పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల రికార్డు సృష్టించినందున ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిల గారిని హైదరాబాద్ లో కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేశారు.

తన తండ్రి వైఎస్సార్ పాదయాత్ర మొదలుపెట్టిన ప్రాంతం చేవెళ్ల నుంచి 2021 అక్టోబర్ 20న ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టారు షర్మిల.

దాదాపు ఏడాదిన్నర పాటు షర్మిల పాదయాత్ర చేశారు. పాదయాత్ర సమయంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యేవి. బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసేవారు.

అరెస్టు వలన మధ్యలో కొన్ని రోజులు పాదయాత్ర ఆగిపోయినా, కోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు.

పలు విదతలలో సాగిన ఈ పాద యాత్ర సందర్భంగా మొత్తం రాష్ట్రం కవర్ చేయదం విశేషం. ఈ పాదయాత్రలో ఆమె అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ పోవదం, ప్రభుత్వం పై చేసిన విమర్శలకు విశేషమైన స్పందన లభించింది.

(సి.హెచ్.ప్రతాప్)