Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మానుకోట జిల్లా కాంగ్రెస్ లో వర్గ పోరు షురూ..!

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఆగస్టు 15,( నిజం న్యూస్):

మానుకోట జిల్లా కాంగ్రెస్లో వర్గ పోరు మొదలైనట్లు తెలుస్తుంది. పట్టణ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం రోజునే ప్రస్ఫుటంగా విభేదాలు కనిపించాయి.

పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి జిల్లా అధ్యక్షుడు గైర్హాజర్ అవడం, మరో నాయకుడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న డాక్టర్ మురళి నాయక్ సైతం గైర్హాజర్ కావడం నాయకుల్లో, కార్యకర్తలలో గుసగుసలు మొదలయ్యాయి.

డాక్టర్ మురళి నాయక్ కుటుంబం జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబానికి నమ్మిన బంటు. గతంలో డాక్టర్ గారి తండ్రి జెడ్పిటిసి గా మురళి నాయక్ భార్య మానుకోట మున్సిపల్ చైర్మన్ గా పదవులను అనుభవించారు.

ప్రస్తుతం మురళినాయక్ గడి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు కావడం జరిగిందని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇది ఇలా ఉంటే 16వ తేదీన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ జిల్లా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ సమావేశానికి కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా నియమితుల అయినట్లు తెలుస్తుంది. ఈ పార్టీ ఇన్చార్జి నాయకత్వంలోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వినికిడి.

అయితే జిల్లాలోని మండల బాధ్యులను పదిమంది ముఖ్యులను తీసుకురావాలని జిల్లా అధ్యక్షులు మాజీ కేంద్రమంత్రి కి ఇతరులకు ఫోన్ల ద్వారా జిల్లా అధ్యక్షుడు తన వర్గాలకు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

పట్టణంలో సుమారు లక్ష జనాభా కలిగి 36 వార్డులుగా ఉండి అందులో కొన్ని వార్డులు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు.

ఇందులో ఎవరెవరికి రేపటి సమావేశానికి సమాచారం ఉందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్నారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునికి జిల్లా అధ్యక్షులు ద్వారా పిలుపు లేదని రెండవ శ్రేణి నాయకులు చెవులు కొరుకుకుంటున్నారు.

బలమైన బీసీ నాయకునిగా ఉన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పిలువని పేరంటానికి ఎలా వెళ్తాం అని తన సహచరుల దగ్గర అన్నట్లు తెలుస్తుంది.

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు స్టేట్ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షుని పిలువకపోతే జిల్లా అధ్యక్షుడు ఆ సమావేశానికి పోతాడా అని కొందరు నాయకులు అనుకుంటున్నారు.

ప్రస్తుతం ఇప్పటివరకు కూడా జిల్లా అధ్యక్షుని ద్వారా రేపటి సమావేశానికి మాకు ఎలాంటి సంకేతం లేదని పట్టణ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.

రేపటి జిల్లా కాంగ్రెస్ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారు ఎవరు కారు రేపటి సమావేశంలో తెలుస్తుందని తటస్థ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రేపటి సమావేశానికి అందరినీ ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ ఒకటే తాటిపై ఉందన్న సంకేతాన్ని జిల్లా ప్రజలకు పట్టణ ప్రజలకు తెలియ చేస్తారో లేదో రేపటి సమావేశం నిర్ణయిస్తుంది అని కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్నారు.