Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వీఆర్ఏ ల పదోన్నతి నియమకాల్లో అవకతవకలు

వీఆర్ఏ ల నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అవకతవకలు పై జిల్లా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించాలి.

పూర్తి సమగ్ర విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలి.

బిఎస్పీ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న డిమాండ్.

తల్లిదండ్రుల వయస్సు దాటాక ముందే,మరణించక ముందే వారసులకు కారుణ్య నియామకాల క్రింద అర్ధర్లు ఇచ్చిన గతంలో పని చేసిన కురవి తహశీల్దార్.

ఎన్ని సంవత్సరాలు నుండి వీఆర్ ఏ ల పేర్లు రిజిస్టర్ లో నమోదు చేసి శాలరీ ఇస్తున్నారో రెవిన్యూ అధికారులు సమాధానం చెప్పాలి.

కురవి,నిజంచెపుతాం,అగస్టు,15:

కురవి మండలంలో వీ.ఆర్.ఏల పదోన్నతుల విషయంలో కారుణ్య నియామకాల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అవకతవకలు పై జిల్లా రెవిన్యూ అధికారులు,ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని బిఎస్పీ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న డిమాండ్ చేశారు.

వీ ఆర్ ఏ ల కారుణ్య నియామకాల్లో తల్లి దండ్రులకు వయస్సు దాటకముందే, వారు మరణించక ముందే వారసులకు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా గతంలో పని చేసిన తహశీల్దార్ అక్రమంగా కాసుల కోసం కక్కుర్తి పడి నియామక ఆర్డర్లు ఇవ్వడం సిగ్గు చేటని అన్నారు.

ఉమ్మడి కురవి,సీరోల్ మండలల్లోని సీరోల్, ఉప్పరిగూడెం,అయ్యగారి పల్లి, బలపాల,కురవి గ్రామాలకు సంబంధించిన పలువురు వీఆర్ఏలకు పదోన్నతుల్లో నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నియామక పత్రాలు ఎలా ఇచ్చారని అన్నారు.గత మూడు సంవత్సరాల క్రితం కురవి లో పని చేసిన తహశీల్దార్ ఈ ఆర్డర్లకు అక్రమంగా శ్రీకారం చుట్టారు అని అలా అక్రమ ఆర్డర్లు సృష్టించి కురవి మండల కేంద్రం తో పాటు పలువురు వీఆర్ఏ లు ప్రమోషన్లు పొందినట్లు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు.

అసలు వీఆర్ఏ ఉద్యోగం వాళ్ల తల్లిదండ్రులు బతికుండగానే, వయస్సు దాటాక ముందే కారుణ్య నియమకాల క్రింద ఎలా వస్తాయో రెవిన్యూ అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

సదురు వీఆర్ ఏ లకు ఎన్ని సంవత్సరాల నుండి సర్వీస్ రిజిస్టర్ లో వారి పేర్లు నమోదు చేసి శాలరీ పేమెంట్ చేస్తున్నారో రెవిన్యూ అధికారులు సంబందించిన సమాచారం బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

కురవి తహసీల్దార్ రఫి ని జరిగిన ఇదే విషయంకు సంబందించి సమాచారం కోసం వివరణ కోరగా వీఆర్ ఏ ల పదోన్నతి నియామకాల్లో ఏ విధమైనా అవకతవకలు నా పిరియడ్ లో జరగలేదు అని నాకు ఏమి తెలియదు అని సమాధానం ఇచ్చారు అని అన్నారు.

అక్రమంగా ఉద్యోగ నియామకాల కోసం అడ్డదారిలో పాటు పాడిన వారి పై తగిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని అన్నారు.కురవి మండలంలో ఈ వ్యవహారం బయటపడిన కొద్ది రోజుల్లో ఓ వ్యక్తి సంబందిత అధికారిపై సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తానని చెప్పడంతో కార్యాలయ సిబ్బంది తోనే అధికారికి సమాచారం అందించి ఆ రాత్రి ఆ కార్యాలయంలోనే బారీ మొత్తంలో చేతులు తడిపారు అని ఆరోపణలు వస్తున్నాయని వాస్తవాలు ఏంటో జిల్లా రెవిన్యూ అధికారులు నిగ్గు తెల్చాలని అని అన్నారు.

ఇప్పటికైనా వీఆర్ ఏ ల పదోన్నతి నియామకాల్లో అవకతవకలకు పాల్పడిన వారి పై జిల్లా రెవిన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి వెంటనే సంబంధిత రెవిన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి అని లేని యెడల బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అధికారులను,ప్రభుత్వంను హెచ్చరించారు.