Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పాత సినిమా పేర్లతో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సినిమాలు ఇవే…

సినిమాలకు మంచి పేర్లు పెట్టుకొని హీట్టుకొట్టడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ పాత సినిమా పేర్లు పెట్టుకొని కూడా సూపర్ హిట్ కొట్టిన సినిమాలు ఏవో తెలుసా???

పాత సినిమా పేర్లు పెట్టుకొని సూపర్ హిట్ కొట్టిన హీరోలు వీరే…

1. మేజర్…

మేజర్ సినిమా 1999 డిసెంబర్ 5న డైరెక్టర్ రవిచంద్రన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య పాత్రలు పోషించారు.. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది..

మళ్లీ 2022 జూన్ 3న మేజర్ సినిమా విడుదలైంది.. ఈ సినిమాకి డైరెక్టర్ శశికిరణ్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో అడివి శేషు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు.. ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా ఈ సినిమాను తీశారు.. ఈ సినిమాకు 32 కోట్లు బడ్జెట్ గా పెట్టి నిర్మించారు.. ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించి 66 కోట్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టింది.. పాత సినిమా పేరుతో వచ్చి సూపర్ హిట్ కొట్టింది

విక్రమ్…

విక్రమ్ సినిమా పేరుతో 1986 మే 23న డైరెక్టర్ మధుసూదన్ రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా… ఈ సినిమాతో అక్కినేని నాగార్జున తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున శోభనాలు ముఖ్య పాత్రలు పోషించారు.. ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించి అక్కినేని నాగార్జునకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది..

మళ్లీ విక్రమ్ అనే అనే పేరుతో 2022 జూన్ 3న డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విక్రమ్ సినిమా విడుదలైంది.. ఈ సినిమాలో కమల్ హాసన్ విజయ్ సేతుపతి ఫహద్ ఫాసిల్ ముఖ్యపాత్రలు పోషించారు.. ఈ సినిమా పాత సినిమా పేరుతో వచ్చిన తెలుగులో మంచి విజయాన్ని సాధించి మంచి గుర్తింపు పొందింది.. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ అండ్ అడ్వెంచర్ గా ఉంటుంది. ఈ సినిమాకి 120 కోట్లు బడ్జెట్ పెట్టగా ఈ సినిమా విడుదలై 500 కోట్లు కలెక్షన్ను థియేటర్ల వద్ద రాబట్టింది.. ఈ సినిమా కమలహాసన్ కు మంచి కం బ్యాక్ సినిమాగా నిలిచింది…

ఖైదీ…

ఖైదీ సినిమా 1983 అక్టోబర్ 28న డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో హీరోగా చిరంజీవి నటించిన ఈ సినిమా విడుదలైంది.. ఈ సినిమాను 25 లక్షలు బడ్జెట్ పెట్టి నిర్మించగా 8 కోట్లు కలెక్షన్స్ రాబట్టి గణ విజయం సాధించి మంచి పేరు తెచ్చి పెట్టింది.

మళ్లీ ఖైదీ సినిమా పేరుతో 2019 అక్టోబర్ 25న డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విడుదలైంది.. ఈ సినిమాలో హీరో కార్తీ ముక్యపాత్ర పోషించారు.. ఈ సినిమాను పూర్తిగా రాత్రిలోనే ఉంటుంది.. ఈ సినిమాను తీయడానికి కేవలం 48 రోజులు సమయం మాత్రమే తీసుకున్నారు మేకర్స్… ఈ సినిమాకు 25 కోట్లు బడ్జెట్ పెట్టగా విడుదలై ఘనవిజయం సాధించి 105 కోట్లు కలెక్షలను తెచ్చిపెట్టింది.. ఈ సినిమా పాత సినిమా పేరుతో వచ్చి తెలుగులో మంచి హిట్టును కొట్టింది..