Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోలు వీరే…

సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టి వారికంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకోవడం చాలా కష్టం. అయినా తమదైన నటనతో ప్రేక్షకులను అలరించి మొదటి సినిమా తోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన హీరోలు ఎవరో తెలుసా???

మొదటి సినిమాతో హిట్ కొట్టిన హీరోలెవరో చూద్దాం…

1. ఉప్పెన…

2021 ఫిబ్రవరి 12న డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఉప్పెన సినిమా విడుదలైంది.. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు… ఉప్పెన సినిమా కు డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు.. హీరోగా వైష్ణవ తేజ్ హీరోయిన్ గా కృతి శెట్టి లు ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించారు.. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి 100 కోట్ల కలెక్షన్ ను రాబట్టింది.. ఈ సినిమా డైరెక్టర్కు హీరోకు హీరోయిన్ కు మొదటి సినిమా అయినా మంచి స్థాయిలో పేరు తెచ్చి పెట్టింది..

2. పిల్లా నువ్వు లేని జీవితం…

పిల్ల నువ్వు లేని జీవితం సినిమా 2014 నవంబర్ 14న డైరెక్టర్ ఏ ఎస్ రవికుమార్ దర్శకత్వంలో విడుదలైంది.. ఈ సినిమాతో హీరోగా సాయిధర్మతేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.. ఈ సినిమాలో సాయిధర్మతేజ్, హీరోయిన్ గా రెజీనా, ప్రకాష్ రాజ్ లు ముఖ్యపాత్రలు పోషించారు.. ఈ సినిమాను 8 కోట్లు బడ్జెట్ నిర్మించగా విడుదలై 15 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ కొట్టింది.. హీరో సాయిధర్మతేజ్ కి మొదటి సినిమాతో మొదటి హిట్ కొట్టాడు..

3.పెళ్లిచూపులు…

పెళ్లిచూపులు సినిమా 2016 జులై 29న విడుదలైంది. ఈ సినిమాకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.. పెళ్లిచూపులు సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ హీరోయిన్ గా రీతు శర్మ లు ముఖ్యపాత్రలు పోషించారు.. ఈ సినిమా డైరెక్టర్ కి హీరో కి మొదటి సినిమా. ఈ సినిమా విడుదలై 30 కోట్లు కలెక్షన్లు రాబట్టి ఒకేసారి డైరెక్టర్ కి హీరోకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది..