Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రయాణికుని ముఖంపై టీ కుమ్మరించిన కాజీపేట రైల్వే చాయివాలా..

భాగ్యనగర్ రైల్లో జరిగిన సంఘటన.

కమలాపూర్ ఆగస్టు 14 (నిజం చెపుతాం) కాజీపేట రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునే సేల్స్ మెన్ ఒక ప్రయాణికుడిపై దురుసుగా ప్రవర్తించి నీవు టీ అడిగావని దౌర్జన్యం చేసి కదులుతున్న భాగ్యనగర్ ట్రైన్ లో కిందికి దిగుతూ కిటికీ పక్కన ఉన్న ఆ ప్రయాణికులపై వేడి వేడి టి కుమ్మరించిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది.

వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి పోస్ట్ ఆఫీస్ ప్రాంతానికి చెందిన భరత్ హైదరాబాద్ వెళ్లి తిరిగి భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైల్లో బెల్లంపల్లి కి వస్తుండగా రాత్రి 7:10 కాజీపేట చేరుకున్న భాగ్యనగర్ రైల్లో చాయ్ అమ్మే సేల్స్ మేన్లు ఒకసారిగా వివిధ భోగిలలోకి వచ్చి టీ అమ్ముకుంటున్నారు.

ఈ క్రమంలో జనరల్ బోగీలో కిటికీ పక్కన ఉన్న భరత్ వద్దకు చాయ్ వాలా వచ్చి టీ అడిగావు అని అతనికి ఛాయతో కూడిన టీ గ్లాస్ ఇచ్చాడు, భరత్ నాకు అసలు టీ అలవాటే లేదని నేను ఎలా టీ అడిగానని బదులిచ్చాడు

అందుకు ఆగ్రహానికి గురైన చాయ్ వాలా మిగతా వారి స్నేహితులతో అతనిపై దౌర్జన్యానికి పాల్పడుతూఅప్పుడే కదులుతున్న ట్రైన్ లో నుంచి కిందికి దిగుతూ ఒక్కసారిగా భరత్ ముఖంపై వేడివేడి చాయి కుమ్మరించి పారిపోయాడు.

జరిగిన సంఘటనపై బాధితుడు ఆర్పిఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసి అతనిపై చర్య తీసుకోవాలని కోరాడు.