Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకము నకు యస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

మహబూబాబాద్, టౌన్ రిపోర్టర్, ఆగస్టు 14,( నిజం న్యూస్)

2023-24 వ, విద్యా సంవత్సరమునకు గాను తెలంగాణా ప్రభుత్వం విదేశీ విద్యాలయముళ్లో ఉన్నత విద్యను అభ్య సించేందుకు షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించబడుచున్న అంటేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకము ద్వారా షెడ్యుల్డ్ కులములకు చెందిన విద్యార్థులకు 20 లక్షల రూపాయల స్కాలర్ షిప్ అందించుటకు నిర్ణయించడమైనది.

యు. యస్.ఎ, యు కె. ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మని, జపాన్, సౌత్ కొరియా న్యూజిలాండ్ విశ్వ విద్యాలయములల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదలగు ప్రొఫెషనల్ కోర్సులల్లో చదువాలనుకుంటున్న యస్సీ విద్యార్థుల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి మహబూబాబాద్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులు తేది:30-09-2023 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన విద్యార్థులకు 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని ఆసక్తి గల యస్సీ విద్యార్థులు ఇట్టి సదవకాశమును వినియోగించుకోగలరని తెలియజేసినారు.

అభ్యర్థుల అర్హతలు: 1 తెలంగాణకు చెందిన యస్సీ కులమునకు చెందినవారై ఉండాలి.

2, సం. ఆదాయము 3.00 లక్షలకు మించకుండ ఉండాలి.

3. పి.జి చదవడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చి ఉండాలి.

4). టి వో ఈ ఎఫ్ ఎల్/ఐ ఇ ఎల్ టి ఎస్/జి.ఆర్.ఇ/జిఎంఎటి నందు అర్హత కలిగి ఉండాలి.

5, పాస్ పోర్ట్ నందు విసా అర్హత కలిగి ఉండాలి.

6, విదేశీ విశ్వ విద్యాలయము నందు అడ్మిషన్ పొంది ఉండాలి.

7. ఒక కుటుంబం నుండి ఒక్కరు మాత్రమే ఈ పథకము నకు అర్హులు.

కావున జిల్లాలోని అర్హులైన యస్సీ విద్యార్థులు www.telangana.epass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని, నిర్దిష్ట మైన ఫార్మాట్లో అవసరమైన డాక్యుమెంట్లతో విద్యార్థులు ధరఖాస్తూ చేసుకోవాలని ఈ పథకం నకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ పాస్ వెబ్ సైట్లో లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.