అధికార పార్టీ వారికి పేదలేనా టార్గెట్
ఇంజమూరి వెంకటయ్య సూటి ప్రశ్న
నేరేడుచర్ల ఆగస్టు 14 నిజం న్యూస్.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం , నేరేడుచర్ల రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 633 ప్రభుత్వ బంచరాయి భూమి విస్తీర్ణం య. 21 – 17 గుంటల భూమి ఉన్నదనీ
అట్టి దానిలో గతంలో నలుగురు ఎస్సీలకు విస్తీర్ణం య. 1-36గుంటలు లావునీ పట్టాలు మంజూరు చేశామనీ మరియు నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డు నకు , స్మశాన వాటికకు మరియు నర్సరీ కొరకు విస్తీర్ణం య. 3-36 గుంటలు కేటాయించమనీ
మేము పెట్టిన సమాచార హక్కు దరఖాస్తు ననుసరించి నెం. బి/ 2620/2023 ద్వారా తేదీ 12-7-2023న మండల తహశీల్దార్ కార్యాలయం నేరేడుచర్ల గారి ద్వారా సంబంధిత ప్రభుత్వ భూమి యొక్క కార్యాలయ రికార్డు నకల్లు ఇవ్వగా
జిల్లా కలెక్టర్ సూర్యాపేట గారికి దరఖాస్తు ఇవ్వనైదనీ తెలుగుదేశం పార్టీ నల్లగొండ పార్లమెంటు సీనియర్ నాయకులు , నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షుడు ఇంజమూరి వెంకటయ్య విలేకరులతో మాట్లాడుతూ
సర్వే నెంబర్ 633 యందు గల బంచరాయి భూమి య. 21-17 గుంటలు ఉండగా ప్రభుత్వం అఫీషియల్ గా పంపిణీ చేసిన భూమి విస్తీర్ణం య. 5-26 గుంటలు పోగా మిగిలిన భూమి 16-09 గుంటల భూమి ఎవరి కబ్జాలో దురాక్రమణ గలదో సర్వేజరిపి ప్రభుత్వ స్వాదీనం చేసుకొవాలనీ వారు కోరారు.
రెవెన్యూ అధికారులు , మున్సిపల్ అధికారులు పేదలు నివశించేందుకు గుడిసెలు వేసుకుంటే తొలగించడం మరియు ఎవరికీ ఆటంకం లేని ప్లాట్ పట్ఝా ఇవ్వబడి ఒక ఎస్సీ పేద మహిళ ఉండేందుకు రేకులతో చిన్న ఇల్లు వేసుకుని నివశిస్తుంటే పలుమార్లు తొలగించేందుకు వస్తూ
ఆ కుటుంబాన్ని మానసిక వేధింపులకు గురిచేశారే మరి దాదాపు కోట్ల విలువ చేసే ఇట్టి (1 6-09 ) పదహరు ఎకరాల తొమ్మిది గుంటల భూమి పట్ల మీ వైఖరిని తెలపాలని అధికారులకు, అధికార పార్టీ వారికి కేవలం పేదలేనా టార్గెట్ నా అని వారు ఆవేధన వ్యక్తం చేశారు.