Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అప్పుడే పుట్టిన పిల్లలకు ఆక్సిజన్ అందడంలో ఇబ్బంది ఎదురైతే.. ఈ సదుపాయం చాలా ఉపయోగకరం

*కొత్తగా పుట్టిన స్థిరీకరణ యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు ఆగస్టు14( నిజం చెపుతాం)

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం.. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో.. నూతనంగా ఏర్పాటు చేసిన కొత్తగా పుట్టిన స్థిరీకరణ యూనిట్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,

ఈ సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు ఆక్సిజన్ అందడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు ఈ సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ,

బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చుతో కూడిన వైద్య మని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సదుపాయం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు

ఎన్.బి.ఎస్.యు ప్రత్యేక డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు ఆక్సిజన్ అందడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు ఇంతకుముందు సంగారెడ్డి ఆసుపత్రి లేదా నీలోఫర్ కి పంపించేవారిమని దీనివలన సమయానికి

ఆక్సిజన్ అందక కొంతమంది చిన్న పిల్లలు మరణించారని ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఇక్కడే ఈ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల పటాన్చెరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని శ్రీనివాస్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ , ప్రభుత్వ ఆసుపత్రి సూపరంటెండెంట్ వసుంధర ,డిప్యూటీ సూపరంటెండెంట్ , ఆరు ఏం ఒ ప్రవీణ , హెచ్ డి ఎస్ సభ్యులు శ్రీనివాస్ పలువురు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.