Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రహదారి నిర్మాణ పనుల అవకతవకలపై అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు

బోయినిపల్లి, ఆగస్టు 14 నిజం చెపుతాం;

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామం వద్ద కరీంనగర్-సిరిసిల్ల వెల్లే రహదారి మార్గాన నాలుగు వరుసల రహదారి నిర్మాణం కొరకు పనులు చేపట్టినారు కానీ రోడ్డు నాణ్యత చూడకుండా,

డాంబర్ రోడ్డును తవ్వి పెకిలించకుండానే,ఇష్టం వచ్చినట్లుగా డాంబర్ రోడ్డుపైనే మట్టి పోయడం జరుగుతుందని, మట్టి రోడ్డుపై వాటర్ కూడా పట్టకుండా రోడ్డు రోలర్ తో తొక్కిస్తున్నారని,

కనీసం ఇక్కడికి వచ్చి ఈ రోడ్డును అధికారులు కూడ పర్యవేక్షించడం లేదని,ఈ సమస్య పైన రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ఖీమ్య నాయక్ కు నీలోజిపల్లి గ్రామస్తులు కూస శ్రీనివాస్ రెడ్డి, కొనుకటి హరీష్ లు పిర్యాదు చేశారు.