వనపర్తి ఫోటోగ్రాఫర్ కు జాతీయ స్థాయి గుర్తింపు
వనపర్తి ,ఆగస్టు 14( నిజం చెపుతాం)
వనపర్తి పట్టణానికి చెందిన కంచ రాజ్ కుమార్ కు ఫెడరేష న్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ సంస్థ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే హానర్స్ కు సంబంధించిన రాజ్ కుమారువి 250 ఫోటోలు పంపించడం జరిగింది.
అందులో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ వారు రాజు తీసిన చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సంబంధించి రాజుకు ఏఎఫ్ఐపి హానర్ తో సత్కరించడం జరిగింది
ఈ హానర్ను వచ్చే నెలలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ మీట్ బీహార్లో అందించడం జరుగుతుంది.
దీనికి సంబంధించి కంచ రాజ్ కుమార్ మాట్లాడుతూ నాకు ఈ హానర్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు .
ఈ గౌరవం సాధించేందుకు మా గురువుగారైన ఎస్వీ రమేష్ గారు ( నవీన ఫోటో పార్లర్ )ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది
నాలోని ప్రతిభను గుర్తించి ఎల్లవేళల నన్ను ప్రోత్సహిస్తూ ఫోటోగ్రఫీలో మెలకువల్లో నేర్పిస్తూ తప్పులను సరి చేస్తూ నాకు నూతన ఉత్తేజాన్ని ఇస్తూ నాకు మంచి గుర్తింపు రావడానికి తోడ్పడిన నా గురువు గారికి రుణపడి ఉంటానన్నాడు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ గౌరవం సాధించిన ముగ్గురిలో నేను ఉండటం సంతోషంగా ఉందన్నారు.
నన్ను అభినందించిన మా కుటుంబ సభ్యులు , తోటి ఫోటోగ్రాఫర్లు శ్రేయోభిలాషులు ఇచ్చిన ప్రోత్సాహం మధురానుభూతిని కలిగించిందన్నారు .
భవిష్యత్తులో మరిన్ని మెలకువలు నేర్చుకుంటూ ఇంకా ఎన్నో మైలురాళ్లను అధిగమించాలని ఇంకా ఎన్నో ఆదివాసీల జీవనా చిత్రాలను తన కెమెరాలో బంధించి భవిష్యత్తులో ఆర్పీఎస్ సాధిస్తానన్నాడు .
ఇతనికి అభినందనలు తెలిపిన పట్టణ పుర ప్రముఖులకు , తన గురువర్యులకు, పత్రిక విలేకరులకు, ఫోటోగ్రాఫర్లకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసినారు.