Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాష్ట్రంలో బిజెపి రధయాత్రలు

రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల వేడి పెరుగుతొంది. మూడు ప్రధాన పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతూ ప్రచారోద్యమాలను తీవ్రతరం చేస్తున్నాయి.

ఇందులో భాగంగా అధికార బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, గత ఎన్నికల సందర్భంగా చేసిన అనేక హామీల అమలు కోసం ఒత్తిడి పెంచేందుకు పోరాటాలు ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది.

ఇందులో భాగంగా వచ్చే నెలలో మూడు కేంద్రాల నుంచి రథయాత్రలు చేపట్టనుంది. ఈ మేరకు ఒక పటిష్ట కార్యాచరణను రాష్ట్ర కార్యవర్గం సిద్ధం చేసింది.

అలంపూర్ (ఉమ్మడి మహబూబ్‌నగర్‌), భద్రాచలం(ఉమ్మడి ఖమ్మం), బాసర (ఉమ్మడి ఆదిలాబాద్‌)నుండి రధ యాత్రలను ప్రారంభించేలా కార్య ప్రణాళిక సిద్ధం అయినట్లు సమాచారం.

ఈ రధయాత్రలు ప్రతీ జిల్లాలో కనీసం ప్రతీ రోజు కనీసం 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కొనసాగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

అయితే ఏ తారీఖు నుండి ఈ రధ యాత్రలు ప్రారంభించాలనే అంశంపై రెండు మూడు రోజులలో స్పష్టత వస్తుందని సమాచారం.

ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.మరొక సమాచారం ప్రకారం సెప్టెంబరు 3 నుండి ఈ రధ యాత్రలు ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది.

కాగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారని సమాచారం.

తొలి దశలో 30 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణను సోమవారం ఖరారు చేయనున్నారు.

ఇందులో భాగంగా దళిత బంధు, బీసీ బంధు, నిరుద్యోగ సమస్య, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, వంటి ప్రధాన అంశాలపై కేసీఆర్ సర్కారు వైఫల్యాలను గ్రామ స్థాయిలో ఎండగట్టేలా భారీ ఎత్తున పలు ఆందోళన కార్యక్రమాలను రూపొందించనున్నారు.

అట్లే రధ యాత్రలో భాగంగా గ్రామ స్థాయిలో ఓటర్లను కలిసి ప్రభుత్వం వైఫల్యాలపై వారికి అవగాహన కల్పించేందుకు రచ్చబండ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారని తెలుస్తోంది.

(సి.హెచ్.ప్రతాప్)

ఇది కూడా చదవండి…రీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే…