Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే…

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టిన సినిమాలు మళ్లీ విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించబోతున్నాయి.. రీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే…

గబ్బర్ సింగ్…

2012 మే 11న డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో విడుదల అయింది.. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్గా శృతిహాసన్ ఈ సినిమాలో ముఖ్యపాత్రులు పోషించారు.. ఈ సినిమా పూర్తిగా కామెడీ అండ్ యాక్షన్ సినిమాగా ఉంటుంది. గబ్బర్ సింగ్ సినిమా విడుదలై 150 కోట్లు మంచి కలెక్షన్లు రాబట్టింది.

గబ్బర్ సింగ్ సినిమా మళ్లీ ఆగస్టు 31న ఈ సినిమా రీ రిలీజ్ కాబోతోంది.. ఈ సినిమా రిలీజ్ అయితే అభిమానులకు పండగే…

యోగి…

యోగి సినిమా 2007 జనవరి 10న డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో విడుదలైంది.. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ మరియు కామెడీ మరి ముఖ్యంగా తల్లి ప్రేమ గురించి ఈ సినిమా ఉంటుంది.. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్గా నయనతార లు ప్రధాన పాత్రలు పోషించారు.. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి 23 కోట్ల కలెక్షన్ రాబట్టింది.

యోగి సినిమా ఆగస్టు 18న రీ రిలీజ్ కాబోతుంది.

గుడుంబా శంకర్…

గుడుంబా శంకర్ సినిమా 2004 సెప్టెంబర్ 10న విడుదలైంది.. ఈ సినిమాకి డైరెక్టర్ వీర శంకర్ బేరి శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్గా మీరాజాస్మిన్ ముఖ్య పాత్రలు పోషించారు.. ఈ సినిమా విడుదల థియేటర్ల వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.. ఈ సినిమా ఘన విజయం సాధించి 16 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ చేసింది…

గుడుంబా శంకర్ సినిమాను మేకర్స్ ఆగస్టు 30న రీ రిలీజ్ చేయబోతున్నారు..

రఘువరన్ B.tech…

రఘువరన్ బీటెక్ 2014 జూలై 18న విడుదలైంది. ఈ సినిమాకు డైరెక్టర్ వేల్ రాజ్ దర్శకత్వం వహించారు… ఈ సినిమా పూర్తిగా కామెడీ మరియు యాక్షన్ సెంటిమెంటల్ సినిమాగా ఉంటుంది..

ఈ సినిమాలో హీరో ధనుష్, హీరోయిన్గా అమలాపాల్ ముఖ్య పాత్రలు పోషించారు.. ఈ సినిమాను శ్రీ స్రవంతి బ్యానర్స్ పై నిర్మించారు.. ఈ సినిమాకు 8 కోట్లు బడ్జెట్ పెట్టి తీశారు.. రఘువరన్ బీటెక్ సినిమా విడుదలై ఘన విజయం సాధించి 16 కోట్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టింది..

రఘువరన్ బీటెక్ సినిమాను మేకర్స్ మళ్లీ ఆగస్టు 18న రీ రిలీజ్ చేయబోతున్నారు…

వెంకీ…

వెంకీ సినిమా 2004 26 మార్చిన డైరెక్టర్ శ్రీనువాట్ల దర్శకత్వంలో విడుదలైంది. ఈ సినిమా పూర్తిగా కామెడీ మరియు యాక్షన్ అండ్ మిస్టరీగా ఉంటుంది.. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ, హీరోయిన్ గా స్నేహ లు ముఖ్యపాత్రలు పోషించారు… ఈ సినిమాను లక్ష్మి ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు.. వెంకీ సినిమా విడుదలై ఘన విజయం సాధించి 11 కోట్లు కలెక్షన్లను రాబట్టింది..

వెంకీ సినిమా మళ్లీ డిసెంబర్ 30న అభిమానుల కోసం మేకర్స్ రీ రిలీజ్ చేయబోతున్నారు…

ఈ సినిమాలు విడుదలై ఘన విజయం సాధించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదల అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి..