Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తండ్రి కోచ్.. కుమారుడు విజేత

శివసాయి కి మోడరన్ ఫౌండేషన్ క్రీడాయశస్వి పురస్కారం

*జాతీయ,అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న తెలుగు యువకుడు

*తండ్రే కోచ్ గా ఉండి కుమారుడిని విజేతగా మలిచిన స్ఫూర్తిదాయక వైనం

*శహాభాష్ శివ సాయి అంటూ ప్రముఖులు అభినందనలు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (రామచంద్రపురం )

(చల్లా శ్రీనివాస్.. నిజం రిపోర్టర్ )

ఆగష్టు 13..నిజం న్యూస్..

కలలు అందరికీ ఉంటాయి.కాని ఆ కలలను శ్వాసిస్తూ ఆపై విజయాన్ని శ్వాసించే వారు మాత్రం అరుదుగా ఉంటూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు.అటువంటి విజేతనే జగ్గంపేటకి చెందిన బుర్ర శివ సాయి వీరబాబు.

చిన్నతనం నుండి తండ్రి కన్నారావు శిక్షణలో నైపుణ్యం సాధించిన శివసాయి అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై విశేషంగా రాణిస్తున్నారు.

ప్రత్యేకించి ఆగష్టు 1నుండి 6 వరకు న్యూ దుబాయ్ లో జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాకిస్తాన్, శ్రీలంక,యూఏఈ, కెన్యా తదితర దేశాల ప్రత్యర్థులతో తలపడి 74 కేజీల విభాగంలో 495 కేజీలు ఎత్తి ప్రధమ స్థానం సాధించి విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు.

ఈ సందర్బంగా మోడరన్ విద్యాసంస్థల అధినేత లయన్ జి.వి.రావు ఆధ్వర్యంలో శనివారం ఇంటర్నేషనల్ యూత్ డే సందర్బంగా మోడరన్ ఇంటర్ విద్యార్థులు నిర్వహించిన మోడరన్ ఎక్స్ ప్రెస్ యూత్ ఫెస్టివల్ కు ముఖ్య అతిధిగా హాజరైన శివసాయిని మోడరన్ అధినేత జి.వి.రావు మోడరన్ ఫౌండేషన్ ద్వారా ప్రతిష్టాత్మకంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ చూపిన వారికి అందజేసే అవార్డులలో భాగంగా “క్రీడా యశస్వి “పురస్కారంతో సత్కరించి భవిష్యత్ నందు శివసాయి మరిన్ని పురస్కారాలు పొందాలని ఆకాంక్షించారు.

ఈ సందర్బంగా జి.వి.రావు మాట్లాడుతూ తండ్రే కోచ్ గా మారి కుమారుడిని విజేతగా తీర్చిదిద్ధటం అందరికీ ఆదర్శప్రాయం అని కొనియాడారు.అలాగే శివసాయికి మోడరన్ ఆత్మీయ ఆహ్వానం చేరవేయుటకు సహకరించిన మన పెద్దాపురం పేస్ బుక్అడ్మిన్ పెద్దిరెడ్డి నరేష్ కి సభాముఖంగా అభినందనలు తెలిపారు.

ఈ సందర్బంగా పురస్కార గ్రహీత శివసాయి మాట్లాడుతూ ప్రతిభను ప్రోత్సహించాలనే మోడరన్ అధినేత లయన్ జి.వి.రావు ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు తెలిపారు.

అలాగే యువత దృఢమైన సంకల్పంతో ప్రయత్నం చేస్తే విజయం సాధించడం సాధ్యమే అని పేర్కొంటూ గెలువు ఓటములు సమానంగా స్వీకరించే గుణం అలవాటు చేసుకుని నిరంతర ప్రయత్నంతో అపజయాన్ని విజయానికి పునాదిగా మార్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మోడరన్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.