Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విఆర్ఏ నియామకాల్లో వినయ విధేయత

తల్లిదండ్రులు బతికుండగానే రిజిస్ట్రార్ లో పేరు నమోదు

తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చేప్పిందే వినయ వేదం.

రికార్డులు మారాలన్న సృష్టించాలన్న ఆఫీసులో రూట్ సపరేటు.

విజయంగా సర్టిఫికెట్.

కలకలం రేపుతున్న కథనాలు.

కురవి,నిజంచెపుతాం,ఆగస్టు,13:

కురవి మండలంలో విఆర్ఏ ల నియామకాల్లో జరిగిన అక్రమ ఆర్డర్లు తల్లిదండ్రులు బ్రతికుండగానే కుటుంబ సభ్యులకు ఆక్రమంగా ఉద్యోగాలు కట్టబెడుతన్న తతగం రోజుకోక్కటి భయటపడుతున్నాయి.

గత నాలుగు రోజుల క్రితం మండలంలోని మొద్గులగూడెం గ్రామానికి చెందిన విఆర్ఏ ఆక్రమ ఉద్యోగం,ఆలవోకగ సర్టిఫికెట్ జారి బయటపడి జిల్లా ఉన్నాతధికారి ఆదేశాలతో తిరిగి ఆ కుటుంబానికి న్యాయం జరిగింది.ఆ ఘటన మరువక ముందే మండల కేంద్రంతో పాటు అయ్యగారిపల్లి, బలపాల,సీరోల్,రాజోలు గ్రామాల్లో ఆ ఆక్రమ నియమాలు బయటపడుతున్నాయి.

గతంలో జిల్లా కేంద్రంలో పని చేసి మూడు సంవత్సరాల క్రితం కురవి తహసీల్దార్ గా పని చేసిన ఆ ఆధికారి ఆక్రమంగా విఆర్ఏ కుటుంబ సభ్యులకు తేలవకుండ లక్షల రూపాయలు తీసుకోని కార్యాలయ రిజిస్ట్రార్,పే రిజిస్ట్రార్ లో పేర్లు నమోదు చేసి ఆక్రమార్కులకు అండగా నిలిచారు. ఆ తతంగం విఆర్ఏ లకు ప్రభుత్వం ప్రమోషన్ ఇస్తుండటంతో రోజుకోకటి బయటకు వస్తుంది.

వినయం దందా..

కురవి తహసిల్దార్ కార్యాలయంలో ఏ పని కావాలన్న ‘వినయం’ గా ‘విజయ’అండదండలతో అడ్డు అదుపు లేకుండ నెలల్లో వచ్చే జీతం గంటల్లో,ఒక రోజులో వచ్చేలా పనులు చక్కబెడుతున్నారనే ఆరోపనలు బహిర్గతం అవుతున్నాయి.

తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే త’వి’నయుడు కార్యాలయంలో తిష్ట వేసి తహసిల్దార్ రెంజ్ లో దండుకోవడం రోజువారి అలవాటేనని గ్రామస్తులు కార్యాలయానికి వచ్చే వారు బహిరంగంగానే చేపుతున్నారు.

అతనికి సోషల్ మీడియాలో జోకుడు వార్తలతో అయా రాజకీయ నాయకుల దగ్గర డంభాకాలు పలుకుతూ సోల్లు నవ్వు తో చిల్లరగా ఆరాటపడే వారిని అడ్డంపెట్టుకోని ఆక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

ఆ సోషల్ మీడియా కధలనాయకుడు శీరంగ నీతులు చెపుతు దొమ్మరి పనులు చేస్తు జిల్లా స్దాయి ఆధికారులు,నాయకులు,నియోజకవర్గ ప్రజప్రతినిధుల వద్ద గురిగింజ వలే నటనచేస్తున్న వారి పేరుతో

కార్యాలయంలో పని చేసే వారిపై పెత్తనం చెలాయిస్తు ఆక్రమ,నకిలీ ఆధార్ కార్డుతో విఆర్ఏ ప్రమోషన్ పోందేందుకు పావులు కదిపినట్లు విస్వసనీయ సమాచారం.

ఈ ఆక్రమ ఉద్యోగి వ్యవహారం తెలిసిన ఓ వ్యక్తి సదరు వ్యక్తి వద్ద దోంగలకే దోంగలా గట్టిగానే ముట తీసుకోని కంపు నోరు ముసుకున్నట్లు అతని సన్నిహిలే గుసగుసలాడుకుంటున్నారు.

ఈ విషయం బయటకు రాగానే విజయ అధికారి ఆరాట పడుతు తాను ఇచ్చిన సర్టిఫికేట్ బయటకు రాకుండా చూడాలని,ఉన్నాతధికారి దృష్టి పోతే ఇద్థరి పరిస్థితి ఆగోమచర్యం అవుతుందని ఆరాట పడుతున్నట్లు తెలుస్తోంది.