Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇకపై జనరిక్ ఔషధాలు తప్పనిసరి 

జనరిక్ ఔషధాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపధ్యంలో వాటికి మన దేశంలోనూ ప్రోత్సాహం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు ముందుకేసింది.

వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే రాయాలని, అనవసర మందులు, అహేతుకమైన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ట్యాబ్లెట్లను సూచించకూడదు అని, మందుల చీటీలో ఔషధాల పేర్లను క్యాపిటల్ అక్షరాల్లో రాయాలని కేంద్రం తాజాగా ఆదేశించింది.

లేకుంటే డాక్టర్లపై చర్యలు తప్పవని అవసరమైతే వారి లైసెన్సును కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈమేరకు నేషనల్ మెడికల్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పేరుతో జారీ చేసిన కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.

తాజాగా ఆ నిబంధనల స్థానంలో ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ నియమావళి 2023 అమల్లోకి తెచ్చినట్టు జాతీయ వైద్య కమిషన్ ( ఎన్‌ఎంసి) వెల్లడించింది.

ఇందులో నిబంధనలను పాటించని వైద్యులపై చర్యలను కూడా స్పష్టంగా పేర్కొన్నారు.

ఇది కూడ చదవండి…చదువుల తల్లి ఒడిలో మిస్టరీ మరణాలు

వైద్యులు జనరిక్ మందులనే ప్రిస్రైబ్ చేయడం వల్ల వైద్య ఖర్చులు తగ్గడంతోపాటు అందరికీ నాణ్యమైన , ఆరోగ్య సంరక్షణను అందించినట్లవుతుంది ” అని ఎన్‌ఎంసీ తమ నిబంధనల్లో పేర్కొంది.

తక్కువ ధరలో లభిస్తున్న జనరిక్ మందులు.. మనదేశంలో ప్రతి ఏటా వేల కోట్ల మెడికల్ బిజినెస్ జరుగుతోంది.

రూపాయి డ్రగ్‌ని పది రూపాయలుకు విక్రయిస్తున్నా ప్రశ్నించలేని పరిస్ధితి. మెడికల్ మాఫియా ఆటకట్టించడానికి జనరిక్ మెడిసన్ వచ్చినా సరైన ఆదరణలేదు.

జనరిక్ వచ్చి 20 ఏళ్లు అవుతున్నా 20% మంది ప్రజలు కూడా జనరిక్ మెడికల్ షాపులకి వెళ్లడం లేదంటే జనరిక్ మెడిసన్ పట్ల ప్రజలకి అవహగానలోపం ఎంతలా ఉందో అర్దం చేసుకోవచ్చు.

మందులపై మొట్టమొదటి తయారు చేసిన కంపెనీ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపనీ అయినా తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయొచ్చు.. అలా తయారు చేసిన మందులను ” జనరిక్_డ్రగ్స్” అంటారు

(సి.హెచ్.ప్రతాప్)