భూ తగాదాలతో వ్యక్తిపై గొడ్డలితో దాడి
తుంగతుర్తి ఆగస్టు 13 నిజం చెపుతాం న్యూస్
భూతగాదాల విషయంలో వ్యక్తిపై ముగ్గురు కలిసి దారి చేసిన సంఘటన మండల పరిధిలోని బండ రామారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బండ రామారం గ్రామానికి చెందిన ఉప్పుల ఎల్లయ్య వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొల్లూరు సోమ నరసయ్య లింగయ్య రాజు కలిసి ఆదివారం తలపై బలంగా గొడ్డలితో దాడి చేసినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
రక్తస్రావం జరగడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు, కుటుంబ సభ్యులు తెలిపారు.