Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వం తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

పట్టణంలో భారీ బైక్ ర్యాలీ

కార్పొరేషన్ సాధించేవరకు పోరాటం ఆగదు. భారీగా ఆర్యవైశ్యులు తరలివచ్చినందుకు అభినందనలు

*సూర్యాపేట ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి నిర్వాహకులు కెక్కిరేని శ్రీనివాస్.

సూర్యాపేట ప్రతినిధి ఆగస్టు 13 నిజం చెబుతాం న్యూస్

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూర్యాపేట ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి నిర్వాహకులు కేక్కిరేణి శ్రీనివాస్ అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని కన్యక పరమేశ్వరి దేవాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించి, పట్టణంలో పలు వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద ముగించి మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం శోషనీయమన్నారు.

ఈ ఎలక్షన్ ముందు అయినా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కలెక్టర్ కు విన్నవిస్తామని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో అతి పేద ఆర్యవైశ్యులను సమానత్వం కోసం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. గతంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ భవనానికి స్థలం ఇస్తానని అన్నారు కానీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నామని తెలిపారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులను కలుపుకొని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమిస్తామని అన్నారు.కార్పొరేషన్ సాధించేవరకు పోరాడుతామని తెలిపారు. ప్రతి ఆర్యవైశ్యులు విధిగా పాల్గొనాలని కోరారు

ఈ కార్యక్రమంలో కర్నాటి కిషన్, బొమ్మిడి లక్ష్మీనారాయణ, కలకోట లక్ష్మయ్య, బెలిదే శ్రీనివాస్, వెంపటి శబరీనాథ్, తల్లాడ చందన్, ఈగ దయాకర్, కొండ్లె కృష్ణయ్య, పెనుగొండ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు…