Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వీ.ఆర్.ఏల నియామకాలలో ఇష్టారాజ్యం..?

కురవి మండలంలో వీ.ఆర్.ఏల నియామకాలో ఇష్టారాజ్యం.

వయసు దాటకముందే వారసులకు తహశీల్దార్ ఆర్డర్లు.

మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపిన కురవి మండల వీ.ఆర్.ఏ నియామకాలు.

చేతులు మారిన కాసుల వర్షం.

కురవి మండలంలో వీ.ఆర్.ఏల నియామకాలో ఇష్టారాజ్యం.

వయసు దాటకముందే వారసులకు తహశీల్దార్ ఆర్డర్లు.

మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపిన కురవి మండల వీ.ఆర్.ఏ నియామకాలు.

చేతులు మారిన కాసుల వర్షం.

కురవి,నిజంచెపుతాం,ఆగస్టు,12:

కురవి మండలంలో వీఆర్ఏల పదోన్నతుల విషయంలో వారసులకు ఎలాంటి నిబంధనలు లేకుండానే గతంలో పని చేసిన తహశీల్దార్ అక్రమాల కు ఆశపడి వీ.ఆర్.ఏ ల తల్లిదండ్రులు బతికి ఉండగానే కాసుల కోసం ఆర్డర్లు ఇవ్వడం ఏంటి అని జిల్లాలో చర్చనీయంగా మారింది.

కురవి మండల కేంద్రంలో పాటు అయ్యగారి పల్లి గ్రామం మరియు బలపాల గ్రామం మరియు కురవి గ్రామం అక్రమంగా ఆర్డర్లు ఇచ్చారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

గత మూడు సంవత్సరాల క్రితం కురవి తహశీల్దార్ గా పని చేసిన వారు ఈ ఆర్డర్లకు అక్రమంగా శ్రీకారం చుట్టారు.,అలా అక్రమ ఆర్డర్లు సృష్టించి కురవి మండల కేంద్రం తో పాటు పలువురు ప్రమోషన్లు పొందినట్లు సంబంధించి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

అసలు వీఆర్ఏ ఉద్యోగం వాళ్ల తల్లిదండ్రులు బతికుండగానే ఎలా వస్తాయని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ అలా జీవో ఉంటదా అని రెవెన్యూ సీనియర్ల అభిప్రాయం కూడా కొంతమంది కోరుతున్నారు.

కురవి మండల కేంద్రంతో పాటు పలు గ్రామంలోని వీ.ఆర్.ఏల అక్రమ నియామకాలు ఎలా పొందుతారని జిల్లా ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్ కి సంబంధిత ఆధారాలతో ఫిర్యాదు చేస్తునట్లు సమాచారం ఈ ఫిర్యాదుతో గౌరవ జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం.

అక్రమంగా ఉద్యోగ నియామకాల కోసం పాటు పాడిన వారిపై తగిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని,కురవి మండలంలో సమాచారం ఈ వ్యవహారం బయటపడిన కొద్ది రోజుల్లో ఓ వ్యక్తి సంబందిత అధికారిపై సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తానని, కార్యాలయ సిబ్బంది తోనే ఈ అధికారికి సమాచారం అందించి ఆ రాత్రి ఆ కార్యాలయంలోనే బారీ మొత్తంలో చేతులు తడిపారు.

సదరు వ్యక్తే దోంగే దోంగల వ్యవహరించి సీగ్గు లేకుండా సీరంగ నీతులు వెల్లగక్కుతున్నారు.ఆ ఆక్రమ దందాకు సోషల్ మీడియా పెరుతో జోకుడు జోకుతూ… అధికారులు…ప్రజా ప్రతి నిధులు అంతా నా కను సన్ననలోనే ఉన్నారంటూ ఉంకదంపుడూ…ముచ్చట్లు.బుర్ర కధల బుకహింపులతో ‘వినయం’గా విఆర్ఏ కోసం విజ్ఞప్తి చేస్తు జిల్లా అధికారులను బురిడికోట్టిస్తున్నట్రు ప్రచారం జరుగుతోంది.

ఈ అక్రమ నియామకాలు కురవి హెడ్ క్వార్టర్ లో నలుగురు వీఆర్ఏలు ఉన్నారు.అందులో ఒకరు ఎవరు ?అనేది ఓ చర్చ నీ అంశంగా మారింది.

తాసిల్దారును వివరణ కోరగా….

ఇవి ఇంతకు ముందున్న వారే నియమించిన వీఆర్ఏ ఉద్యోగాలే నేను ఎవరిని కొత్తగా నియమించలేదు ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు.