Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తుస్సుమన్న భోళాశంకర్- నైరాశ్యంలో మెగా ఫాన్స్ 

మెగాస్టార్ చిరంజీవి- బ్యూటీ తమన్నా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ . మెహర్ రమేశ్ షూటింగ్ ప్రారంభం నాటి నుండి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మెగా సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది.

ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ యాక్ట్ చేయగా.. కీలకపాత్రలో సుశాంత్ నటించాడు. మొదటి రీజే రెండు తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీసు వద్ద డివైడ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు.

భారీ అంచనాలు పెట్టుకుంటే.. మూవీ అవుట్ డేటెడ్‌గా ఉందంటూ సినీ ప్రియులు అంటున్నారు. సినిమా చూసిన వారు నెట్టింట ట్రోల్స్ ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలున్నాయి ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే.. మేకర్స్ ఈ సినిమాకి కూడా ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేశారు.

చిరంజీవి కాకుండా ఒక జూనియర్ హీరోతో కూడా చేయడానికి పనికిరాని ఈ సినిమాను చేయడానికి చిరంజీవి ఎలా ఒప్పుకున్నారని నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

భోళా శంకర్ మూవీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు రూ.30 కోట్ల గ్రాస్, రూ.15 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మెగాస్టార్ గత చిత్రాలతో పోలిస్తే.. ఈ సినిమాకు తక్కువ కలెక్షన్స్ వచ్చాయి అని గణాంకాలు చెబుతున్నాయి.

ఇందులో కామెడీ అనుకుని తీసిన చాలా సన్నివేశాలు నిట్టూర్పులు తెప్పిస్తాయి. ప్రేక్షకుడికి వినోదం కానీ, ఉత్కంఠగానీ కలిగించకుండా.. ఆమాటకొస్తే నవరసాల్లో ఏ రసాన్నీ అందించకుండా కేవలం నీరసాన్ని మాత్రమే ఇచ్చిన ఘనత ఈ చిత్రానికి చెందుతుంది అని మెగా ఫాన్సే ఏకంగా పెదవి విరుస్తున్నారు.

ఈసారి చిరు సినిమా సాక్షిగా దర్శకుడు మెహర్ రమేష్ ట్రోలింగ్ కు గురవుతున్నాడు. చిరంజీవి లాంటి స్టార్ ను సరిగ్గా చూపించలేదని, పాత చింతకాయ పచ్చడి లాంటి కథను చిరంజీవి లాంటి స్టార్ కు వాడారంటూ మెహర్ పై విరుచుకుపడుతున్నారు

మెగా ఫ్యాన్స్.ఇంతకు ముందు విడుదలైన మరొక మెగా ఫామిలీ సినిమా “బ్రో” కూడా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడం, రజనీకాంత్ జైలర్ చిత్రం మంచి టాక్ స్వంతం చేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ మరింత నీరసపడిపోతున్నారు.

(సి.హెచ్.ప్రతాప్)