Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మతిస్థిమితం లేని మహిళను అన్నపూర్ణ చారి ట్రబుల్ ట్రస్ట్ సూర్యాపేటకు పంపించిన ఎస్ఐ 

“ఎస్సై పరమేష్ ఆధ్వర్యంలో”

నేరేడుచర్ల ఆగష్టు 12(నిజం చెపుతాం న్యూస్ ):

మతిస్థిమితం లేని మహిళను ఎస్సై పరమేష్ పోలీస్ సిబ్బంది ద్వారా అన్నపూర్ణ చారి ట్రబుల్ ట్రస్ట్ కు సూర్యాపేట తరలించడం జరిగింది

నేరేడుచర్ల మున్సిపాలిటీ పట్టణం లో గత 15 రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఒక మహిళను. నేరేడుచర్ల ఆర్ఎస్ఎస్ సేవాభారతి వారు గుర్తించి నల్గొండ ఆర్ఎస్ఎస్ సేవాభారతి కి చెందిన శ్రీకాంత్ కి తెలిపారు శ్రీకాంత్ సేవాభారతి అంబులెన్స్ లో

*”అన్నపూర్ణ చారిట్రబుల్ ట్రస్ట్-సూర్యాపేట”* కు తరలించడం జరిగింది.

నెల కిందట కూడా ఒకసారి ఇలాగే తరలించితే మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఆ మతి స్థిమితం లేని మహిళ ఆమె ఎవరో ఆమె కుటుంబ సభ్యులకు అప్పు చప్పవాల్సిందిగా కొంతమంది కోరుతున్నారు కానీ మతిస్థిమితం లేని మహిళ ఏ వివరాలు చెప్పకపోవడంతో

నేరేడుచర్ల ఆర్ఎస్ఎస్ సేవాభారతి వారు పట్టణ పోలీస్ స్టేషన్లో తెలియచేసి పోలీసు వారి అనుమతితో, పట్టణ ప్రజల సమక్షంలో ఆమెకు నెమ్మదిగా వివరించి ఆమె సహకారంతోనే అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ కు పంపించడం జరిగింది

15 రోజులుగా ఆమెని కాపాడుతున్న వారికి ఆహారం మంచినీరు అందించిన వారికి మరియు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆర్ఎస్ఎస్ సేవాభారతి తరపున పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు మెట్టు వేణుగోపాల్ రెడ్డి బాల వెంకటేశ్వర్లు దేవి రెడ్డి నాగిరెడ్డి ఎడవల్లి సైదిరెడ్డి రాచకొండశ్రీనివాస్ ఊట్కూర్ నటరాజ్ వీరయ్య కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు