పటిష్ట బందోబస్తు నడుమ ఏజెన్సీలో మంత్రి పువ్వాడ ఎంపీ మాలోత్ కవిత పర్యటన

పినపాక నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పర్యటన పటిష్ట బందోబస్తు నడుమ కొనసాగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అత్యంత మారుమూల గ్రామమైన చొ ప్పాల లో రూ.రెండు కోట్ల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మణుగూరు సబ్ డివిజన్ ఏఎస్పి డాక్టర్ శబరీష్ ఐపీఎస్ పర్యవేక్షణలో ఏడూళ్ల బయ్యారం సిఐ దోమల రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. , ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టీవీఎన్ సూరి, కరకగూడెం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ లు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మంత్రి పువ్వాడ పర్యటన ప్రశాంతంగా ముగియడం పట్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.