Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తొలి జాబితా కోసం ప్రధాన పార్టీల కసరత్తు

అసెంబ్లీ ఎన్నికల కోసం వచ్చే నెల రోజులలో తొలి జాబితాలను విడుదల చేయాలని తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అంతర్గతంగా లక్షం నిర్దేశించుకున్నాయి. ఇందుకు పార్టీలో వివిధ అబ్యర్ధుల బలా బలాలను, విజయావకాశాలను అంతర్గతంగా బేరీజు వేసుకునే ప్రక్రియను కొనసాగిస్తూనే ప్రైవేటు సర్వేలను నమ్ముకుంటున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వై సి పి ఇప్పటికే రెండు విదతల పాటు పరివేట్ సంస్థ చేత సర్వే చేయించి తదనుగుణంగా తమ ప్రజాకర్షణ గ్రాఫ్ ను పెంచుకునేందుకు మూడు నెలలు సమయం ఎమ్మెల్యేలకు ఇచ్చింది.

ఇప్పుడు అదే ప్రక్రియను మూడు ప్రధాన పార్టీలు తెలంగాణాలో అనుసరిస్తున్నాయి. వివిధ అసెంబ్లీ స్థానాల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న నాయకుల జాబితాను సిద్దం చేస్తున్న ప్రధాన పార్టీలు వారి ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

ఓవైపు కర్నాటకలో కాంగ్రెస్ కు అధికారం సాధించిపెట్టిన వ్యాహాన్ని అనుసరిస్తూ ప్రజాకర్షక హామీలపై కసరత్తు చేస్తూనే తెలంగాణ రాజకీయ పార్టీలు వివిధ నియోజక వర్గాలలో గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి.

సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఇప్పటికే పలు మార్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రస్తుతం మరొకవైపు ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐ-ప్యాక్ సంస్థతో కూడా సర్వేలు చేయించుకుంటున్నారు.

ఇంటెల్ నివేదికలతోపాటు ఐ-ప్యాక్ సర్వే రిపోర్టును పోల్చుకుంటూ సిట్టింగు ఎమ్మెల్యేలకే మళ్ళీ అవకాశమివ్వాలా లేక కొత్త వారిని ఎంపిక చేసుకోవాలా అన్నది తేల్చబోతున్నారు.

ఈ ప్రైక్రియ దాదాపుగా 50 శాతం పూర్తయ్యిందని రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.

ఐ పాక్ సంస్థ సర్వేలో నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారికి ప్రవర్తన మార్చుకోవాలని లేకూంతే టికెటు వదులుకోవడానికి సిద్ధంగా వుండాలని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

కాగా సర్వే ద్వారా పాజిటివ్ రిపోర్టు వచ్చి తప్పకుండా గెలుస్తారన్న సిట్టింగులకు తిరిగి టికెట్లిస్తూ మొదటి లిస్టును విడుదల చేయాలని తలపెట్టినట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణాలో అధికారం హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం 26 మందితో జంబో ఎన్నికల కమిటీని నియమించింది .

రాష్ట్ర కీలక నేతలందరికీ ఇందులో చోటు కల్పించారు. ఈ ఎన్నికల కమిటీ ఇపుడు నియోజకవర్గాల వారీగా టికెట్లను ఆశిస్తున్న నాయకుల జాబితాను రెడీ చేస్తోంది. ఇందులో ఏకాభిప్రాయం కుదిరిన వారితో తొలి జాబితా విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది.

కాగా మరొక కధనం ప్రకారం సునీల్ కొనుగోలు టీం ద్వారా సర్వే చేయించి తద్వారా విజయావకాశాలు వున్న అభ్యర్ధులను ఎంపిక చేయాలని అధిష్టానం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఇక బి ఆర్ ఎస్ ను గద్దె దించదమే లక్ష్యంగా వున్న బి జె పి అధిష్టానం తాజాగా అభ్యర్థుల జాబితా తయారీ బాధ్యతలను రాష్ట్ర స్థాయిలో అయిదుగురు కీలక నేతలకు ఇచ్చిందని జ్తెలుస్తోంది.

తొలి జాబితా ఈ అయిదుగురు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన వారితో బీజేపీ విడుదల చేస్తోందని తెలుస్తోంది.

అయితే మిగితా పార్టీలలా ఏదైనా ప్రైవెట్ ఏజన్సీలతో సర్వే చేయించుకుంటోందా అన్న అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

ప్రత్యేక కధనం: సి.హెచ్.సాయిప్రతాప్

ఇది కూడా చదవండి…పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు