Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రెండు గిత్తలు కోటి రూపాయలు

హుజూర్నగర్ ఆగస్టు 10 (నిజం చెపుతాం)

రెండు గిత్తలు కోటి రూపాయలకు అమ్మిన సంఘటన సూర్యపేట జిల్లా హుజూర్నగర్ లో చోటుచేసుకుంది.హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సుంకి సురేందర్ రెడ్డి హైదరాబాదులో ఏసీపి గా పని చేస్తున్నారు.

చిన్నతనం నుండి వ్యవసాయంపై మక్కువ ఉండేది. ఆయన ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నా వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు.

ముఖ్యంగా ఎడ్ల పందాలు అంటే బాగా ఇష్టం దాంతో పందెం గిత్తలను శ్రద్ధతో ప్రత్యేక పని వాళ్ళతో వాటిని మేపి మంచి శిక్షణ ఇప్పించి ఎడ్ల పందాల్లో పాల్గొనేవారు.

తెలంగాణలో, ఆంధ్రాలో సురేందర్ రెడ్డి గిత్తలు అంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

తాను పెంచుకున్న గిత్తల్లో ఓ జతను అమ్మకానికి పెట్టగా సురేందర్ రెడ్డి గిత్తలు అంటే మంచి క్రేజ్ ఉండటంతో ఏపీలోని బాపట్ల జిల్లాకి చెందిన ఓ రైతు రూ.కోటి రూపాయలు చెల్లించి వీటిని సొంతం చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 9 నెలల్లో జరిగిన 40కి పైగా పోటీల్లో ఈ గిత్తలు పాల్గొన్నాయి. వాటిలో 34 సార్లు ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత ధర పలికిన గిత్తల జత లేదని ఆయన తెలిపారు.