Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎస్సైగా ఎంపికకైన దళిత బిడ్డకు ఆలయ కమిటీ సన్మానం

–జీవితం విసిరే సవాలను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది

–నా తల్లిదండ్రులు పడ్డ కష్టాన్నికి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను

–ఎస్సై ఎలమర్తి కిరణ్ కుమార్

వనపర్తి బ్యూరో ఆగస్టు 10 ( నిజం చెపుతాం ) వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని 7 వార్డ్ కు చెందిన ఎలమర్తి బుచ్చన్న, తిరుపతమ్మ ల మొదటి కుమారుడు కిరణ్ కుమార్ కు ఎస్సై ఉద్యోగం రావడం వల్లన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు గురువారం రోజు ఆలయ ఆవరణలో కిరణ్ కుమార్ మరియు వారి తల్లిదండ్రులను శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్భముగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ మాది పేద కుటుంబం అయినప్పటికీ మా అమ్మా,నాన్నలు నా చదువు పట్ల ఎప్పుడూ ఏ లోటు లేకుండా నను చదివించారు.మా అమ్మానాన్న నాకు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు.

నీవు ఏదైనా సాధించాలి అనుకుంటే నువ్వు ముందుకు వెళ్ళు నీ వెనకాల మేము ఉన్నాము.

మనం ఏదైనా సాధిస్తేనే పదిమంది మనల్ని గుర్తిస్తారు అని చెప్పేవారు.నా తల్లిదండ్రులు పడ్డ కష్టాన్నికి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను.

ఉద్యోగ రీత్యా విధి నిర్వణలో అమ్మ నాన్నలకు ఎలాంటి మచ్చ లేకుండా నా విధి నిర్వహిస్తానన్నారు.

అనంతరము ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పాలక వర్గసభ్యులు,గ్రామ పెద్దలు,యువత పాల్గొన్నారు.