Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఓటీటీలో విడుదల కానున్న ఆదిపురుష్…

2023 జూన్ 16న డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా విడుదలైంది.. ఈ సినిమాలో పాన్ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవ దత్త నాగే హనుమంతుడిగా ఈ సినిమాలో ముఖ్యపాత్రులు పోషించారు..

ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్ పై 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను తెరకెక్కించారు.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషలలో విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది.

ఈ సినిమా పూర్తిగా మనందరికీ తెలిసిన మహర్షి వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా ఈ సినిమాను తీశారు..

ఈ సినిమాలో భారీ విజువల్స్, బిఎఫ్ ఎక్స్ వంటివి  భారీగా ఉపయోగించారు. ఈ సినిమాకు ముందుగా 500 కోట్ల రూపాయలు బడ్జెట్ అనుకున్నారు. ఆ తర్వాత విడుదలైన టీజర్ అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల మళ్లీ మేకర్స్ ఇంకో 200 కోట్లు బడ్జెట్ను పెంచి సినిమాలో మార్పులు చేర్పులు చేసి విడుదల చేశారు..

ఆ తర్వాత విడుదలైన ట్రైలర్ తో అంతకుముందు విడుదలైన టీజర్ పైన చేసిన ట్రోల్స్ అన్ని ఈ ట్రైలర్తో చెరిగిపోయాయి.. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా అన్ని సినిమా ధియేటర్లలో విడుదలై ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది..

అయితే ఈ సినిమాలో రామాయణం ఆధారంగా తీసిన అక్కడక్కడ మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను విడుదల చేశారు.. ఈ సినిమా విడుదలై థియేటర్లో అధిక వసూలు రాబట్టి ఘన విజయం సాధించింది..

అయితే విషయంలోకొస్తే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఆది పురుషుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.. ఆదిపురుష సినిమాను ఓటీటీ లో విడుదల చేసేందుకు మేకర్ సిద్ధమయ్యారు…

ఆదిపురుష్ సినిమాను జియో సినిమాలు, నెట్ఫిక్స్ ,హాట్ స్టార్ ,అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో విడుదల చేయనున్నారు. అయితే ఆది పురుష సినిమాను ఆగస్టు 15 కానీ ఆగస్టు నెల 30న విడుదల చేయనున్నారు..