Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అభివృద్ధి చేద్దామంటే అడ్డుపడుతున్నారు

డోర్నకల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేద్దామంటే అడ్డుపడుతున్నారు.

డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానంటే అడ్డుపడుతున్నారు.

ఎవరు అడ్డుపడినా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడతా.

డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా.

నేను డోర్నకల్ లో అడుగు పెట్టింది స్వలాభం కోసం కాదు.

నాకు ఆదాయ మార్గాలు ఎన్నో, వ్యాపారాలు ఎన్నో ఉన్న తృప్తినివ్వక ప్రజాసేవను ఎంచుకున్న.

డోర్నకల్ ప్రజలను అభివృద్ధి పరిచే దిశగా పనిచేస్తా.

అమ్మా నాన్నలతో కలిసి రోజువారికి కూలికి వెళ్లి ఈ స్థాయికి వచ్చిన వాన్ని.

ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా

చూసిన వాడిని.

ఒక్కసారి నమ్మి చూడండి మీ నమ్మకాన్ని ఓమ్ము చేయను

కిసాన్ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షుడు భూపాల్ నాయక్.

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఆగస్టు 10,( నిజాం న్యూస్):

ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ప్రకృతి కూడా పాత నీరును వదిలించుకొని కొత్త నీటిని ఆహ్వానిస్తుంది. కానీ డోర్నకల్ నియోజక వర్గానికి ఏమి “శని “పట్టిందో కానీ , నాయకులు కుర్చీ వదలమన్న వదలటం లేదు.

రాబోయే కాలం యువ తరానిది. కొత్త యువత రాజకీయాల్లోకి రావాలి. నియోజకవర్గ అభివృద్ధికి పునాదులు వేయాలి. ఈ క్రమంగా డోర్నకల్ నియోజకవర్గానికి నూతనతరం యువత ముందుకు వస్తుంది.

అలాంటి యువత లో ప్రముఖ వ్యాపారవేత్త, కిసాన్ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షులు, భూపాల్ నాయక్ ముందంజలో ఉన్నారు. ఇటీవల కాలంలో మీ కష్టాల్లో పాలుపంచుకోవడానికి నేనున్నాను.

నియోజకవర్గ అభివృద్ధిలో నేను పాలుపంచుకుంటాను అంటూ ముందుకు వచ్చిన భూపాల్ నాయక్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న, కుహాన రాజకీయ నాయకులు, డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి నిరోధకులు, అడ్డు తగులుతున్న నిర్భయంగా, నిరాటంకంగా నియోజకవర్గ అభివృద్ధికి అప్రహతిగాతంగా ముందుకు సాగుతున్న భూపాల్ నాయక్.

నిరుద్యోగ యువతకు తన సంస్థలలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా దశాబ్దాలుగా డోర్నకల్ నియోజకవర్గాన్ని ఏలిన నాయకులు ఎవరైనా చెప్పారా!? నిరుద్యోగ యువతను ఆదుకొని వారికి ఉద్యోగ కల్పనలో తోడుంటానని ప్రతి సభలో నొక్కి వక్కానిస్తున్న భూపాల్ నాయక్ ప్రసంగాలను నియోజకవర్గ యువత గమనిస్తుంది.

ఒక్కసారి అవకాశం ఇస్తే ఏమవుతుంది అనే ధోరణిలో యువత ఆలోచనలు ఉన్నాయి.

తనకున్న వ్యాపార సంస్థల ద్వారా కోట్లు కూడా పెట్టే అవకాశం ఉన్న నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాల ఆరోగ్య పరిస్థితిలో కానీ, ఆర్థిక పరిస్థితులే కానీ, అభివృద్ధికి ఆమడ దూరంలోని నియోజకవర్గ పరిస్థితులను చూసి మనసు చలించిపోయింది.

అందుకే నిస్వార్ధంగా అట్టడుగు ప్రజానీకానికి సేవ చేయాలనే సదుద్దేశంతో డోర్నకల్ నియోజక వర్గాన్ని ఎంచుకున్నానని భూపాల్ నాయక్ అన్నారు.

రాబోయే ఎన్నికలలో మహబూబాబాద్, ఇల్లందు, ఎమ్మెల్యేలను ఎంపీ సీటు గెలుపుకు కృషి చేయడమే కాక ఆర్థిక, హార్దిక అవకాశాలు కూడా కల్పిస్తానని భూపాల్ నాయక్ ధీమాగా చెప్పారు.

కష్టాలు లో పుట్టి పెరిగిన నేను అమ్మానాన్నలతో కలిసి కూలికి వెళ్లే వాడిని, కష్టనష్టాలకు ఓర్చి ఈ స్థాయికి వచ్చా నని నియోజకవర్గ ప్రజల కష్టాలను అతి దగ్గర నుండి చూసాను.

కాబట్టి ఈ ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేద్దామని ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని డోర్నకల్ నియోజకవర్గాల ప్రజలకు భూపాల్ నాయక్ అంజలి ఘటించి విజ్ఞప్తి చేశారు.